Woman Gave Birth on The Train Track: రైలులో ప్రయాణిస్తున్న సమయంలో పురిటి నొప్పులు రావడంతో ఓ మహిళ రైలు పట్టాలపైనే ప్రసవించిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రం బరంపుర్కు చెందిన ప్రియాపాత్ర అనే మహిళ బరంపుర్ నుంచి సూరత్‌కు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తోంది.. అయితే, రైలు ప్రయాణంలో ప్రియాపాత్రకు తీవ్రమైన పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు పార్వతీపురం మన్యం జిల్లాలోని బెలగాం రైల్వే స్టేషన్ […]
Chintamaneni Prabhakar: ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. దెందులూరు నియోజకవర్గంలో సంక్రాంతి వేడుకలు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రాబోయే 20 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నియోజకవర్గంలోని ఉద్యోగస్తులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేతుల మీదుగా పిండి వంటలు పంపిణీ చేశారు. కుటుంబ […]
Srisailam: శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో రాత్రి వేళ బేరీ తాండవంతో సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ, ధ్వజపటావిసర్జన, అంకురార్పణ పూజలను దేవస్థానం ఈవో శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణకు ముందుగా ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుడిని పల్లకీలో ఊరేగించి ఆలయ ప్రదక్షిణ చేయించి ధ్వజస్తంభం వద్దకు వైభవంగా తీసుకువచ్చారు. అక్కడ వేద మంత్రోచ్చారణల మధ్య అర్చకులు, వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. సంక్రాంతి […]
Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలతో సమావేశం, కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను విడుదల చేశారు. ఎన్నికలు నిర్వహించే 117 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఓటర్లు 51,92,220 మంది ఉన్నారు. వీరిలో మహిళలు 25,37,136, పురుషులు 26,54,453, ఇతరులు 631 […]
Union Budget 2026: బడ్జెట్ 2026-27కు సిద్ధమైంది ఎన్డీఏ సర్కార్.. వచ్చే నెల అంటే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్ పై ఇప్పటికే ఫోకస్ పెట్టారు. రాష్ట్రాల ఆర్ధిక మంత్రుల తో సమావేశం కూడా నిర్వహించారు.. ఏపీకి కేంద్ర బడ్జెట్ నుంచి వచ్చే నిధులు… వివిధ పథకాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని సీఎం చంద్రబాబు మంత్రులకు, అధికారులకు సూచించారు.. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృ ద్ధికి అవసరమైన […]
Jana Sena Party: జనసేన పార్టీ.. రాష్ట్ర ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు కీలక విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలకు ప్రతిరోజూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు అందుతున్న పరిస్థితి ఆందోళనకరమని జనసేన పేర్కొంది. చిన్నచిన్న సమస్యలకే ప్రజలు రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని ఆశ్రయించాల్సి వస్తోందంటే, అది వ్యవస్థ సక్రమంగా పని చేయడం లేదనే సంకేతమని స్పష్టం చేసింది. స్థానిక అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని జనసేన […]
Suryalanka Beach: ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్.. సూర్యలంక బీచ్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో సూర్యలంక బీచ్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు స్వదేశీ దర్శన్ 2.0 కింద రూ.97 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. షాపింగ్ స్ట్రీట్, పార్కింగ్ సదుపాయాలు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ బిల్డింగ్ పనులు చేపట్టారు. వీటితో పాటు […]
AP Government: ఉద్యోగులు, వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు కూటమి ప్రభుత్వ సంక్రాంతి పండుగ వేళ శుభవార్త చెప్పింది.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు చెల్లింపుల నిమిత్తం నిధులు విడుదల చేసినట్లు ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు.. నీరు – చెట్టు బిల్లులు సహా వివిధ వర్గాలకు ఊరటనిస్తూ బిల్లులను క్లియర్ చేసింది ఆర్థిక శాఖ.. మొత్తంగా రూ.2,653 కోట్ల మేర ఉద్యోగులు డీఏ, డీఆర్ ఎరియర్స్, కాంట్రాక్టర్ల బిల్లులకు నిధులు విడుదల చేసింది ప్రభుత్వం.. […]
Gunda Appala Suryanarayana Passes Away: ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అలియాస్ గుండ సూర్యనారాయణ కన్నుమూశారు. ఇంటిలో కాలుజారి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలవ్వగా, గత రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్దిసేపటి క్రితమే ఆయన మృతి చెందినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను […]
Liquor Prices Hike: సంక్రాంతి పండుగ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ప్రియులకు షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ ధరలు పెరిగాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, రూ.99 ఎంఆర్పీ ఉన్న మద్యం బాటిళ్లను మినహాయించి మిగిలిన అన్ని రకాల మద్యం ఉత్పత్తులపై ఒక్కో బాటిల్‌కు రూ.10 చొప్పున ధర పెంచారు. ఇందులో IMFL, FL, బీర్, వైన్ వంటి అన్ని విభాగాల […]