వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’ చేస్తున్నాడు. టీసీరీస్ సంస్థ దాదాపు 500కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది. ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణునిగా నటిస్తున్నారు. అయోధ్య నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. నిన్న రాత్రి ముంబై, బాంద్రాలోని దర్శకుడు ఓంరౌత్ ఇంట్లో ఇచ్చిన పార్టీలో ప్రభాస్ కూడా పాల్గొన్నాడు.
బ్లాక్ జీన్స్ మెరూన్ షర్ట్‌లో కొత్త లుక్ లో కనిపించాడు ప్రభాస్. గతంలో కంటే సన్నబడటం విశేషం. ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమా కోసం శరీరాకృతిని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టిన ప్రభాస్ ఆ విషయంలో చాలా వరకూ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. డార్లింగ్ అభిమానులు కోరుకున్నట్లు ఫిట్ గా తయారవుతున్న ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజున కానుకగా విడుదల చేయబోతున్నారు.