టాలీవుడ్ సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెలుగు సహా వివిధ భాషల్లో సుమారు 800 పైగా సినిమాలకు పని చేసిన ఆయన సినిమా కోసమే పుట్టారేమో అంటూ తెలుగు పరిశ్రమలో వారు అంటూ ఉంటారు. గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన అనారోగ్య కారణాలతో కొన్నాళ్ల క్రితమే హాస్పిటల్లో చేరారు. కొన్నిరోజులు క్రితమే డిస్చార్జ్ అయ్యారు. అయితే అనూహ్యంగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం […]
టాలీవుడ్ లో చిన్న చిత్రాల జోరు కొనసాగుతూనే ఉంది. ఈ వీకెండ్ లో అనువాద చిత్రాలతో కలిపి ఏకంగా ఎనిమిది సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. జూన్ 7వ తేదీ హాలీవుడ్ మూవీ ‘థోర్ లవ్ అండ్ థండర్’ గ్రాండ్ వే లో రిలీజ్ అవుతోంది. అలానే గత నెలలో తమిళంలో విడుదలైన సత్యరాజ్ తనయుడు శిబి రాజ్ నటించిన ‘మయోన్’ తెలుగు డబ్బింగ్ మూవీ కూడా గురువారమే జనం ముందుకు వస్తోంది. శుక్రవారం ఆరు […]
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర పోషించిన ‘హ్యాపీ బర్త్ డే’ మూవీ ఈ నెల 8న విడుదల కాబోతోంది. అయితే ఇది అందరూ అనుకుంటున్నట్టు ఉమెన్ సెంట్రిక్ మూవీ కాదని, ఇందులో తనతో సహా ఇతర ప్రధాన పాత్రలు పోషించిన వారందరి పాత్రలు ప్రాధాన్యమైనవేనని లావణ్య త్రిపాఠి చెబుతోంది. దర్శకుడు రితేశ్ రాణా కథ చెప్పినప్పుడు కొత్తగా అనిపించిందని, సర్రియల్ వరల్డ్ థాట్ చాలా ఎగ్జయిట్ చేసిందని ఆమె తెలిపింది. తనను చాలామంది సీరియస్ పర్శన్ […]
డాన్స్ మాస్టర్‌గా స్టార్ హీరోలకు ఎన్నో సూపర్ డూపర్ సాంగ్స్ కంపోజ్ చేసి ప్రశంసలందుకున్నారు ప్రభుదేవా. మరోవైపు దర్శకుడిగా, నిర్మాతగా కూడా పలు సినిమాలకు పనిచేసి తనలోని ప్రతిభను బయటపెట్టారు. ఇక నటుడిగా ఎన్నో సినిమాల్లో తనదైన ముద్ర వేశారు. ఈ క్రమంలోనే ప్రభుదేవా ప్రధానపాత్రలో రాబోతున్న కొత్త సినిమా ‘మై డియర్ భూతం’. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు ఎన్. […]
పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా షాజీ కైలాస్ తెరకెక్కించిన సినిమా ‘కడువా’. ఈ సినిమాను మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 7న విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. కానీ ఇప్పుడు కేవలం మలయాళ వర్షన్ ను మాత్రమే 7వ తేదీ విడుదల చేస్తున్నారు. మిగిలిన నాలుగు భాషల్లోనూ ఈ సినిమా 8వ తేదీ రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని నిర్మాతలు లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ తెలిపారు. నిజానికి ‘కడువా’ […]
“నారాయణతే నమో నమో…” అంటూ గానం చేస్తూ ఎస్.వరలక్ష్మి ‘సతీసావిత్రి’ చిత్రంలో తొలిసారి గళం వినిపించారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. అంతకు ముందే బాలగాయకుడిగా మధురం పంచి, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణనే పరవశింప చేసిన ఘనత మంగళంపల్లి వారి సొంతం. “సలలిత రాగసుధారస సారం…” అని ఆలపించి, నటరత్న నందమూరి అభినయానికి తగిన గళవిన్యాసాలు చేసి ‘నర్తనశాల’లో సుధారసమే కురిపించారు మంగళంపల్లి. ఆపై యన్టీఆర్ కే ‘శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథ’లో “వసంత గాలికి వలపుల రేగ…” అంటూ […]
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమా 2012లో జూలై 6న విడుదలై విజయవంతంగా నడుస్తున్న సమయంలోనే ‘అందాల రాక్షసి’ మూవీ కూడా విడుదలైంది. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్ర నిర్మాణంలో ఎస్. ఎస్. రాజమౌళి సైతం భాగస్వామిగా వ్యవహరించారు. ఈ సినిమాతో హీరోహీరోయిన్లుగా నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠితో పాటు దర్శకుడిగా హను రాఘవపూడి పరిచయం అయ్యాడు. సో… వీళ్ళందరూ ఆగస్ట్ 10వ తేదీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి 10 […]
కన్నడ నటుడు కిరణ్ రాజ్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతోన్నాడు. కన్నడలో రీసెంట్‌గా వచ్చిన ‘బడ్డీస్’ సినిమాతో కిరణ్ రాజ్ హీరోగా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ విజయోత్సాహంతోనే కిరణ్ రాజ్ తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. కిరణ్ రాజ్ హీరోగా కుమారి సాయి ప్రియ సమర్పణలో కణిదరపు రాజేష్, పి. ఉషారాణి ‘విక్రమ్ గౌడ్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. పాశం నరసింహారావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపికా సింగ్ హీరోయిన్ గా […]
‘ధర్మచక్రం’ అనగానే విక్టరీ వెంకటేశ్ నటించిన సినిమా గుర్తొస్తుంది. ఇప్పుడు అదే పేరుతో మరో సినిమా తెరకెక్కుతోంది. సంకేత్ తిరుమనీడి, మోనిక చౌహాన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు నాగ్ ముంత దర్శకత్వం వహిస్తున్నారు. జీపీ రెడ్డి నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి వరుణ్ క్లాప్ కొట్టగా, రాజశేఖర్ కెమెరా స్విచ్ఆన్ చేశారు. ఎం. శ్రీధర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమా గురించి నిర్మాత జీపీ రెడ్డి మాట్లాడుతూ, ”సమాజంలో […]