తెలుగులో ఈ యేడాది తొలి ప్రథమార్ధంలో వచ్చిన అనువాద చిత్రాలు ‘కేజీఎఫ్, విక్రమ్’ మంచి విజయం సాధించాయి. దాంతో మన నిర్మాతలు, పంపిణీదారుల దృష్టి పరభాషా చిత్రాల తెలుగు హక్కులపై పడింది. అలా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్వీ ప్రసాద్, చియాన్ విక్రమ్ ‘కోబ్రా’ హక్కులను సొంతం చేసుకున్నారు. తొలి నుండి ప్రయోగాత్మక చిత్రాలకు విక్రమ్ ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాడు. అలానే దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తుకూ మంచి […]
డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో మంచి విజయాన్ని సాధించిన వెబ్ సిరీస్ ‘పరంపర’. దాని సీజన్ -2 ట్రైలర్ వచ్చేసింది. జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించిన ఈ వెబ్ సీరిస్ ను ఎల్. కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్ డైరెక్ట్ చేశారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఇది రూపొందించారు. ఈ సెకండ్ సిరీస్ ఈ నెల 21 తేదీ నుంచి […]
సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన డీజే టిల్లు మూవీ.. సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది ఈ సినిమా. ఇందులో సిద్దు జొన్నలగడ్డ క్యారెక్టర్‌ను చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. సిద్దు బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, యాటిట్యూడ్ ఈ సినిమా సక్సెస్‌కు ప్లస్ అయ్యాయి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్‌గా నేహా శెట్టి గురించి.. ఈ బ్యూటీ గ్లామర్ […]
‘సర్కారు వారి పాట’తో సూపర్ సక్సెస్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మహేష్ ఈ మూవీ స్క్రిప్టుని లాక్ చేశారని.. దాంతో ఆగష్టు మొదటి వారంలో రెగ్యులర్ షూట్‌ని ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక SSMB28 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్నఈ సినిమాలో.. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమానికి కూడా హాజరైన పూజా హెగ్డేను.. ఆ మధ్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్టు […]
స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల తరువాత మణిరత్నం డైరెక్షన్‌లో వస్తున్న సినిమా కావడంతో.. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా భారీ క్యాస్టింగ్‌తో రూపొందుతోంది.. విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్, త్రిష వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా పార్ట్1ను సెప్టెంబర్ 30న భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు […]
రీసెంట్‌గా ఖిలాడిగా ఆకట్టుకోలేకపోయిన రవితేజ.. ఈసారి రామారావుగా హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామారావు అన్ డ్యూటీ’ జూలై 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాతో పాటు ధమాకా..రావణాసుర.. టైగర్ నాగేశ్వరరావు.. సినిమాలు కూడా చేస్తున్నారు మాస్ మహారజా. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ సెట్స్ పై ఉన్నాయి. అయితే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రవితేజ.. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగాస్టార్ 154వ సినిమాలోను.. కీలక పాత్రలో […]
చిత్రపరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తన టాలెంట్ తో హీరోగా రాణించి మీడియమ్ రేంజ్ హీరోగా సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు నాని. నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నాని స్టార్ హీరో అనిపించుకోవడం ఇక నల్లేరుబండి మీద నడకే అనుకున్నారు ఒకప్పుడు. అయితే అది ఇప్పుడు ఎండమావిగానే మిగిలిపోతుందనిపిస్తోంది. మీడియమ్ రేంజ్ హీరోలుగా ఉన్న వారిలో ముందువరుసలో ఉన్నప్పటికీ అక్కడనుంచి ఓ మెట్టు ఎక్కే ప్రయత్నం మాత్రం విజయవంతం కావటం లేదు. కెరీర్ […]
బుల్లతెరపై యాంకర్ గా రాణించి వెండితెరపై నటిగా, ఐటం గర్ల్ గా పేరు తెచ్చుకున్నా అనసూయ జబర్దస్త్ షో నుంచి మాత్రం తప్పుకోలేదు. కానీ తొలిసారి ఈ కామెడీ షోతో తన జర్నీ ముగిసినట్లు ప్రకటించింది. అందుకు కారణం స్టార్ మాలో చక్కటి పారితోషికంతో పలు కార్యక్రమాలలో బిజీగా ఉండటమే కాదు మధురవాణి పాత్ర కూడా ఓ కారణమట. జాగర్లమూడి క్రిష్ సోనీ లివ్ కోసం ‘కన్యాశుల్కం’ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. గురజాడ అప్పారావు నవల ఆధారంగా […]
నాగార్జునతో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి తో కలసి నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్. నాగార్జున టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ నెల 9న రిలీజ్ కానుంది. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు మేకర్స్. ఈ సందర్భంగా పోస్టర్ ను విడుదల చేస్తూ ‘ఘోస్ట్’ ఇంట్రో పరిచయ తేదీని ప్రకటించారు. […]
క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.యస్.రామారావు పేరు తెలియనివారు తెలుగు చిత్రసీమలో ఉండరు. ఇక ఆయన నిర్మించిన చిత్రాల గురించి సగటు సినిమా అభిమానికి తెలియకుండా ఉండదు.