ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ తో, సైన్స్ ఫిక్షన్ మూవీగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో రూపొందుతోన్న సూపర్ ఉమెన్ మూవీ `ఇంద్రాణి`. యానియా భరద్వాజ్, కబీర్ దుహన్ సింగ్, షతఫ్ అహ్మద్, గరీమా కౌశల్, ఫ్రనైట జిజిన తదితరులు నటిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్స్, మేకింగ్ వీడియోకి విశేష ఆదరణ లభించింది. తాజాగా ఈ మూవీలో సంజయ్ స్వరూప్, మధు నందన్ కీలకపాత్రలలో నటించనున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ తాజా మరో పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత స్టీఫెన్ మాట్లాడుతూ, ”’ఇంద్రాణి’ సినిమా ఇండియన్ సూపర్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) అనే సంస్థ, దాని కార్యకలాపాల చుట్టూ ఉంటుంది. ఐ.ఎస్.ఎఫ్. సంస్థకు నాయకత్వం వహించే కీలక పాత్రలలో సంజయ్ స్వరూప్, మధునందన్ నటించనున్నారు. ఐ.ఎస్.ఎఫ్. సరిహద్దు భద్రత, అంతర్జాతీయ సమస్యలకు సంబంధించిన విషయాలలో నిమగ్నమై ఉంటుంది. వారికి మద్దతు ఇచ్చే భారత సైన్యంతో కలిసి పని చేస్తుంది. ఇండియన్ సినిమాలో ఇంతకు ముందెన్నడూ లేని విశిష్టమైన కథాంశంతో ‘ఇంద్రాణి’ చిత్రం రూపొందుతోంది” అని అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్టాన్లీ సుమన్ బాబు మాట్లాడుతూ, ”మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే గోవాలో సెకండ్ షెడ్యూల్ పూర్తిచేశాం. హైదరాబాద్‌లో మూడో షెడ్యూల్‌ను పూర్తి చేసి, అనుకున్న ప్రకారం 2022 అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని చెప్పారు.