Mareechika: నిర్మాతగా రచయిత లక్ష్మీ భూపాల!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ రచయిత లక్ష్మీ భూపాల నిర్మాతగా మారారు. లక్ష్మీ భూపాల ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో రెండు సినిమాలు నిర్మిస్తున్నారు. అందులో రెండవది ‘మరీచిక’. దీనిని ఆయన వన్ మోర్ హీరో మీడియా సంస్థకు చెందిన రాజీవ్ చిలకతో కలిసి నిర్మిస్తున్నారు. ‘సినిమా రంగం తనకెంతో ఇచ్చిందని, దానిని తిరిగి ఇవ్వడం బాధ్యతగా భావించి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాన’ని లక్ష్మీ భూపాల తెలిపారు.
జాతీయ అవార్డు గ్రహీత సతీశ్ కాశెట్టి దర్శకత్వం వహించే ‘మరీచిక’ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు లక్ష్మీ భూపాల అందిస్తున్నారు. బ్యూటిఫుల్ హీరోయిన్లు రెజీనా కసాండ్ర, అనుపమా పరమేశ్వరన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. విరాజ్ అశ్విన్ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ను గురువారం విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తే అందులో కేవలం పాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ పాదాల ప్రతిబింబం నీళ్లలో ఓ అమ్మాయి నీడలాగా కనిపిస్తోంది. ఈ పోస్టర్‌కు ‘ప్రేమ ద్రోహం ప్రతీకారం’ అనేది క్యాప్షన్ పెట్టారు. ఇది రొటీన్ మూవీ కాదనే భావన ఈ పోస్టర్ ద్వారా దర్శక నిర్మాతలు కలిగించారు. ‘ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయ్యిందని, ఈ నెల 26 నుంచి రెండో షెడ్యూల్ జరుగుతుందని, లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ మ్యాస్ట్రో ఇళయరాజా ఈ రొమాంటిక్ డ్రామాకి సంగీతాన్ని అందిస్తున్నార’ని నిర్మాతలు తెలిపారు. అరవింద్ కన్నాభిరాన్ ఈ మూవీకి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తాను నిర్మిస్తున్న తొలి చిత్రం వివరాలు సైతం త్వరలోనే వెల్లడిస్తానని, ఆ సినిమా కూడా సెట్స్ పై ఉందని లక్ష్మీ భూపాల తెలిపారు.
Also Read
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
తాజావార్తలు
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు