ప్రస్తుతం యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్.. ఆ తర్వాత SR కళ్యాణ మండపం సినిమాతోను మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘సెబాస్టియన్’ కాస్త నిరాశపరిచింది. అలాగే ఇటీవల వచ్చిన ‘సమ్మతమే’ కూడా సో సోగానే నిలిచింది. దాంతో ఎలాగైనా సరే హిట్ కొట్టి మరోసారి తన సత్తా చాటాలనుకుంటున్నాడు కిరణ్. అందుకు తగ్గట్టే.. కిరణ్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.. మొత్తంగా అరడజనుకు పైగానే సినిమాలున్నాయి.. అవి కూడా టాలీవుడ్ బడా బ్యానర్స్‌లో తెరకెక్కుతున్నాయి. దాంతో రాబోయే రోజులు కిరణ్ అబ్బవరంకు కలిసొచ్చేలానే ఉన్నాయి. ఇటీవలె ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ అనే సినిమా టీజర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. శ్రీధర్ గాదే దర్శకత్వంలో.. కోడీ దివ్య ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై.. కోడి రామక్రిష్ణ కూతురు కోడి దివ్య దీప్తి ఈ సినిమాను నిర్మిస్తోంది.
ఇక తాజాగా కిరణ్ అబ్బవరం బర్త్‌డే సందర్భంగా కొత్త సినిమాల అప్టేట్స్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై.. బన్నీ వాసు నిర్మాణంలో.. కిరణ్ హీరోగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే సినిమా తెరకెక్కుతోంది. మురళీ కిశోర్ అబ్బురు ఈ సినిమాతో తెలుగు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించి.. ‘వైబ్ ఆఫ్ వినరో భాగ్యము విష్ణు కథ’ అనే పేరుతో.. చిన్న వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో.. మా జీవితాలన్నీ ఏడు కొండల చుట్టూ తిరగతా ఉంటాయ్.. అని సినిమా పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు కిరణ్. అలాగే ‘మీటర్’ అనే మరో కొత్త సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. మైత్రీ మూవీస్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై.. రమేష్ కాడూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కిరణ్ మాస్ లుక్‌లో కనిపించబోతున్నాడు. దీంతో పాటు ‘రూల్స్ రంజన్’ లుక్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇవే కాదు మరికొన్ని సినిమాలను కూడా లైన్లో పెట్టాడు కిరణ్. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో ఇంత క్రేజీ లైనప్ మరో హీరోకు లేదు.. దాంతో కిరణ్ బ్యాక్ టు బ్యాక్ అలరించబోతున్నాడని చెప్పొచ్చు.