రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ది వారియర్’ మూవీతో తమిళ దర్శకుడు లింగుస్వామి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే… ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా తొలిరోజున వరల్డ్ వైడ్ రూ. 8.73 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా శుక్రవారం సంస్థ కార్యాలయంలో సక్సెస్ సెలబ్రేషన్స్ ను జరుపుకున్నారు. హీరో రామ్, విలన్ పాత్రధారి ఆది పినిశెట్టి, హీరోయిన్ కృతీశెట్టి, దర్శకుడు లింగుస్వామి, నిర్మాత శ్రీనివాసా తదితరులు కేక్ కట్ చేశారు. సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, లభిస్తున్న ఆదరణ పట్ల వారు సంతృప్తిని వ్యక్తం చేశారు.