రజనీకాంత్ హిట్ సినిమాలలో ‘చంద్రముఖి’ ఒకటి. హారర్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తమిళనాటనే కాదు తెలుగులోనూ ఘన విజయం సాధించంది. సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రానుంది. అయితే ఇందులో రజనీకాంత్ నటించటం లేదు. ఆయన వీరాభిమాని రాఘవ లారెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుంచి మైసూర్‌లో మొదలైంది. అయితే తన గురువు నటించిన సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న సందర్భంగా లారెన్స్ రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోయే ముందు రజనీకాంత్ ఆశీస్సులు అందుకున్నాడు.
సోషల్ మీడియాలో రజనీకాంత్‌తో ఉన్న పిక్స్ షేరు చేస్తూ ‘హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్ చంద్రముఖి 2 షూటింగ్ నా తలైవర్ రజనీకాంత్ ఆశీస్సులతో ప్రారంభమవుతుంది. మీ అందరి ఆదరణ నాకు దక్కాలి’ అని అన్నాడు. వడివేలు ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు ఆర్‌డి రాజశేఖర్ కెమెరామేన్ గా, తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది.
Hi friends and fans, Today Chandramukhi 2 shooting begins in Mysore with my Thalaivar and guru’s @rajinikanth blessings! I need all your wishes! 🙏🏼🙏🏼 #Chandramukhi2 pic.twitter.com/dSrD3B5Xwh
— Raghava Lawrence (@offl_Lawrence) July 15, 2022