యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు ఇవాళ! దాంతో అతను నటిస్తున్న సినిమాల ప్రొడక్షన్స్ హౌసెస్ నుండి విషెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్స్ వస్తున్నాయి. ఇందులో భాగంగా ‘రూల్స్ రంజన్’ టీమ్ సైతం తమ హీరోకి బర్త్ డే విషెస్ తెలిపింది. ఎ. ఎం. రత్నం సమర్పణలో నిర్మితమౌతున్న ఈ చిత్రంలో ‘డి. జె. టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ను ఎ. ఎం. రత్నం తనయుడు రత్నం కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దివ్యాంగ్ లవానియా, వి. మురళీకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘వెన్నెల’ కిషోర్, హిమాని, వైశాలి, జయవాణి, ముంతాజ్, సత్య, అన్ను కపూర్ (బాలీవుడ్), సిద్ధార్థ సేన్ (బాలీవుడ్), అతుల్ పర్చురే (బాలీవుడ్) , ఆశిష్ విద్యార్థి, అజయ్ వంటి టాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన నటీనటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
‘రూల్స్ రంజన్’ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే కిరణ్ అబ్బవరం బిజినెస్ మ్యాన్ సూట్ లో చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. తను ఇంతవరకు మాస్ సినిమాలే ఎక్కువగా చేసినా క్లాస్ పీపుల్స్ ను కూడా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మాస్ టచ్ తో పూర్తి క్లాస్ క్యారెక్టర్ చేస్తున్నాడని ఈ పోస్టర్ చూస్తుంటే అర్థమౌతోంది. అమ్రేష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు దిలీప్ కుమార్ సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్నాడు.