Unstoppable 2: ఇదేమి చిత్రంరా బాబూ...అన్న రీతిలో నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న 'అన్ స్టాపబుల్' సీజన్ 2 కూడా సాగుతోంది. ఈ రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ లోనే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ కనిపించి సందడి చేశారు.
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ‘లైగర్’ ఘోర పరాజయం నుంచి ఇంకా తేరుకున్నట్లు లేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అటు పూరీకి, ఇటు విజయ్‌కు పూర్తిగా నిరాశ పరిచింది. ఆగస్ట్ 25వ తేదీన ‘లైగర్’ విడుదలైంది. ఈ సినిమా పరాజయం విజయ్ దేవరకొండకు పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఆ తర్వాత విజయ్ ఏ పబ్లిక్ వేదికలో కనిపించలేదు. తాజాగా ‘ప్రిన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మెరిశాడు. అయితే తన రెగ్యులర్ […]
Ori Devuda: రెండేళ్ళ క్రితం తమిళంలో విడుదలై, చక్కని విజయాన్ని సాధించిన ‘ఓ మై కడవులే’ సినిమాను తెలుగులో ‘ఓరి దేవుడా’ పేరుతో రీమేక్ చేశారు. అక్కడ అశోక్ సెల్వన్ హీరోగా నటించగా, ఇక్కడ విశ్వక్ సేన్ చేశారు. తమిళంలో విజయ్ సేతుపతి పోషించిన గాడ్ క్యారెక్టర్‌ను విక్టరీ వెంకటేష్ పోషించారు. ఈ సినిమాలో హీరోకు తన మావగారి సిరమిక్స్ కంపెనీలో పనిచేయడం కంటే.. నటన మీదనే మక్కువ ఎక్కువ. యాక్టర్‌గా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు […]
Kantara Movie: ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే హిందీ చిత్రసీమనే అనే భావన ఉండేది. దానిని బెంగాల్ దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే చెరిపేశారు. ఇక దక్షిణాది సినిమా అంటే ‘మదరాసీ చిత్రం’ అనే పేరుండేది. ఎందుకంటే అప్పట్లో దక్షిణాది నాలుగు భాషల చిత్రాలకు మదరాసే కేంద్రం. ఇప్పుడు సౌత్ సినిమా అంటే తెలుగు చిత్రాలదే పైచేయి అయినా ఐఎండీబీ రేటింగ్స్‌లో కన్నడ సినిమాలు సంచలనం సృష్టిస్తూ ఉండడం విశేషం. ఇటీవల తెలుగులోనూ విడుదలై సంచలన విజయం […]
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నటించిన 'మాన్ స్టర్' సినిమా దీపావళి కానుకగా ఈ నెల 21న విడుదల కానుంది. వైశాఖ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఉదయ్‌కృష్ణ రచయిత. ఈ సినిమాని గల్ఫ్ దేశాల్లో నిషేదించారు. ఎల్‌జీబీటీక్యూ సీన్స్ ఉండటం వల్లే ఈ సినిమాను నిషేదించినట్లు వినిపిస్తోంది.
Mega MultiStarrer: అసలు సిసలు మల్టీస్టారర్‌కు నిదర్శనంగా నిలిచింది ఇటీవల వచ్చిన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ. ఇలా ప్రస్తుత కాలంలోని ఇద్దరు సూపర్‌స్టార్లతో సినిమా చేయాలంటే ఎంతో కసరత్తు చేయాలి. రాజమౌళి కాబట్టే ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో మల్టీస్టారర్ సాధ్యపడింది. అయినా ఆయా స్టార్స్ అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి. అది టీ కప్పులో తుఫాన్‌లా సమసిపోయినా ఇప్పటికీ సోషల్ మీడియాలో స్టార్స్ అభిమానుల తాటాకు చప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. మరి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలా మరో మల్టీస్టారర్ […]
Jyothika: ముద్దుగా బొద్దుగా ఉన్నా, నటనతోనూ, నర్తనంతోనూ మురిపించారు జ్యోతిక. తమిళ స్టార్ హీరో సూర్యను పెళ్ళాడిన తరువాత కూడా తనకు తగ్గ పాత్రలలో ఆమె నటిస్తూ అలరిస్తున్నారు. తెలుగునాట మెగాస్టార్ చిరంజీవి 'ఠాగూర్'తో తొలిసారి మెరిసింది జ్యోతిక. తరువాత జ్యోతిక నటించిన అనేక అనువాద చిత్రాలు తెలుగువారిని ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు జ్యోతిక.
ప్రపంచంలో ఎంతోమంది నటీనటులకు స్వర్గధామం హాలీవుడ్! అక్కడ నేమ్ అండ్ ఫేమ్ సంపాదించిన తారలు ఎందరో హాలీవుడ్‌ను వదిలేస్తూ ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.