Devulapalli Krishna Shastri: తెలుగు చిత్రసీమలో పాటల పందిరి అంటే ప్రఖ్యాత దర్శకులు బి.యన్.రెడ్డి రూపొందించిన ‘మల్లీశ్వరి’నే ముందుగా చెప్పుకోవాలి. అందులో ప్రతీ పాట సందర్భోచితంగా అమృతం చిలికింది. అందుకు బి.యన్. కళాతృష్ణ ఓ కారణమయితే, ఆయన మదిని చదివి మరీ సాహిత్యం చిలికించిన ఘనత దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిదే! దేవులపల్లి వారి వాణికి అనువుగా సాలూరు రాజేశ్వరరావు బాణీలు సాగాయి. అందుకే ‘మల్లీశ్వరి’ ఓ పాటల పందిరిగా ఈ నాటికీ సాహితీ సువాసనలు వెదజల్లుతూనే ఉంది. […]
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావును జనం ‘అన్న’గా అభిమానించారు, ఆరాధించారు, ‘అన్న’ అనే అభిమానంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయనను ముఖ్యమంత్రిగానూ నిలిపారు. అంతలా యన్టీఆర్ ‘అన్న’గా జనం మదిలో ముద్రవేశారు. అంతకు ముందు ఎన్ని చిత్రాలలో యన్టీఆర్ అన్న పాత్రల్లో నటించి అలరించినా, ఆయనకు ‘అన్న’గా తరిగిపోని, చెరిగిపోని స్థానం కల్పించిన సినిమా ‘రక్తసంబంధం’ అనే చెప్పాలి. అనేక చిత్రాలలో యన్టీఆర్ కు హిట్ పెయిర్ గా అలరించిన సావిత్రి, ఈ సినిమాలో ఆయనకు చెల్లెలుగా […]
‘ఐశ్వర్య రాయ్ ఓ అందాల అయస్కాంతం’ అనీ కితాబు నిచ్చిన వారెందరో ఉన్నారు. ఈ నాటికీ ఐశ్వర్య అందం కనువిందు చేస్తూనే ఉంది. విశ్వసుందరి కాలేకపోయింది ఐశ్యర్యారాయ్, ప్రపంచసుందరిగానే ఆమె అందంతో బంధాలు వేసింది. విశ్వసుందరిగా నిలచిన సుస్మితా సేన్ కన్నా మిన్నగా ఐశ్వర్యారాయ్ అందం జనాన్ని ఆకర్షించింది. మోడల్ గా ఉన్న సమయంలోనే ఐశ్వర్య అందాన్ని చూసి, ‘దివి నుండి దిగివచ్చిన తారక…’ అనుకున్నారు జనం. వెండితెరపై నటిగా వెలగగానే, తమ అభిప్రాయంలో ఏ మాత్రం […]
తెలుగు చిత్రసీమలో వెలుగులు విరజిమ్మిన పరభాషా తారలు ఎందరో! వారిలో నాజూకు షోకులతో మురిపించిన వారు కొందరు. అలాంటి వారిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించింది గోవా పాలకోవాగా అభిమానులచే జేజేలు అందుకున్న ఇలియానా. తెలుగు సినిమాలతోనే నటిగా ఇలియానా కెరీర్ ఆరంభమయింది. తరువాత ఏ భాషలో ఎంతగా వెలిగినా, ఇలియానా వెలుగులు తెలుగునాట ప్రసరించినంతగా ఎక్కడా ప్రభ చూపలేకపోయాయి. ఇలియానా డి’క్రుజ్ 1987 నవంబర్ 1న ముంబయ్ లో జన్మించింది. ఆమె తండ్రి కేథలిక్ […]
President Gaari Pellam: ఓ సినిమాతో స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న హీరోకు సదరు చిత్రం ప్రభావం కొంతకాలం పాటు సాగుతుంది. కొన్నిసార్లు అది ‘ప్లస్’ కావచ్చు, మరికొన్ని సమయాల్లో ‘మైనస్’గానూ మారవచ్చు. ‘దేవదాసు’ సినిమా తరువాత ఏయన్నార్ కు అలాంటి పరిస్థితే వచ్చింది. దాని నుండి బయట పడటానికి అన్నట్టు ఆయన ‘మిస్సమ్మ’లో కామెడీ రోల్ లో కనిపించారు. ‘అల్లూరి సీతారామరాజు’ ఘనవిజయం తరువాత కృష్ణ నటించిన దాదాపు డజన్ సినిమాలు పరాజయం పాలయ్యాయి. మళ్ళీ ఆయన […]
October Progress Report: అక్టోబర్ మాసంలో తెలుగులో మొత్తం 29 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో 7 అనువాద చిత్రాలు ఉన్నాయి. విశేషం ఏమంటే దసరా, దీపావళి సందర్భంగా పలు చిత్రాలు ఆయా వారాలలో విడుదలయ్యాయి. అయితే తెలుగు స్ట్రయిట్ చిత్రాలకంటే అనువాద చిత్రమైన ‘కాంతార’నే ఈ నెలలో విజయకేతనం ఎగరేసి అగ్రస్థానంలో నిలిచింది. ఈ నెల ఒకటవ తేదీన ‘బలమెవ్వడు’ మూవీ విడుదలైంది. ఆ తర్వాత దసరా కానుకగా చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ది […]
Naga Babu:చిరంజీవి తమ్ముడు అనే ముద్ర నుండి బయటపడి తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు నాగబాబు. నటనిర్మాతగా తనదైన బాణీ పలికించిన నాగబాబు తన సోషల్ మీడియా ద్వారా కూడా సదా వార్తల్లో నానుతూ ఉంటారు. ప్రస్తుతం కేరెక్టర్ రోల్స్ ధరిస్తూ బిజీగా సాగుతున్నారు నాగబాబు.
Raghava Lawrence:'కష్టించి పనిచేసేవాడిదే ఈ లోకం..' అన్నారు పెద్దలు. ఆ మాటను తు.చ. తప్పక పాటించిన వారిలో అత్యధికులు విజయతీరాలు చేరుకున్నారు. అలాంటి వారిలో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ నూ తప్పకుండా చేర్చాలి. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా రాఘవ కెరీర్ సాగింది. డాన్స్ మాస్టర్, నటుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడుగా రాఘవ తన ప్రతిభను చాటుకుంటూ సాగుతున్నారు.
Anjali Devi:అంజలీ దేవి పేరు వినగానే ఆ తరం ప్రేక్షకులకు 'సీతమ్మ' అనే గుర్తుకు వస్తుంది. తెలుగువారి తొలి రంగుల చిత్రం 'లవకుశ'లో సీతమ్మ పాత్రలో ఆమె నటించలేదు, జీవించారనే చెప్పాలి. అందుకే ఈ నాటికీ బుల్లితెరపై ఆ సినిమా రాగానే అంజలీదేవిని సీతమ్మ పాత్రలో చూసి పులకించిపోయేవారు ఎందరో!