Mega MultiStarrer: ‘చరణ్ అర్జున్’ సాధ్యమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega MultiStarrer: అసలు సిసలు మల్టీస్టారర్‌కు నిదర్శనంగా నిలిచింది ఇటీవల వచ్చిన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ. ఇలా ప్రస్తుత కాలంలోని ఇద్దరు సూపర్‌స్టార్లతో సినిమా చేయాలంటే ఎంతో కసరత్తు చేయాలి. రాజమౌళి కాబట్టే ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో మల్టీస్టారర్ సాధ్యపడింది. అయినా ఆయా స్టార్స్ అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి. అది టీ కప్పులో తుఫాన్‌లా సమసిపోయినా ఇప్పటికీ సోషల్ మీడియాలో స్టార్స్ అభిమానుల తాటాకు చప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. మరి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలా మరో మల్టీస్టారర్ సాధ్యమేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ఆ ఆలోచన చేస్తోంది మహా గట్టివాడైన అల్లు అరవింద్ కాబట్టి. ఇటీవల ఓ టాక్ షోలో ఇదే విషయమై కొంచెం క్లారిటీ ఇచ్చాడు అరవింద్. అందులో రామ్ చరణ్, అల్లు అర్జున్‌తో మల్టీస్టారర్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించాడు. దీని కోసం ‘చరణ్ అర్జున్’ అనే టైటిల్‌ను కూడా రిజిస్టర్ చేశారట. దీనిని పలు దఫాలుగా రెన్యువల్ కూడా చేస్తు వస్తున్నాడట.
Read Also: Heroines Hot Gallery: హాట్ హాట్ భామలు.. అబ్బాయిలకు కిక్కే కిక్కు
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ఈ ఇద్దరు హీరోల సూపర్ స్టార్‌డమ్‌ను హ్యాండిల్ చేయగల సత్తా ఉన్న దర్శకుడు దొరకపోవడంతో పాటు వారి ఇమేజ్‌కు తగ్గ కథ సిద్ధంగా లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ అడుగు కూడా ముందుకు పడటం లేదట. నిజానికి రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇంతకు ముందు ‘ఎవడు’ అనే సినిమాలో కలిసి నటించారు. అయితే ఆ సినిమా కథ ప్రకారం ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కూడా కనిపించలేదు. ఆ తర్వాత పరిస్థితులలో ఎంతో మార్పు వచ్చింది. రెండు ఫ్యామిలీస్ మధ్య గ్యాప్ పెరిగిందనే రూమర్స్ ఎటూ ఉన్నాయి. ఇటు రామ్ చరణ్ అటు అల్లు అర్జున్ సూపర్ స్టార్ డమ్ తెచ్చుకున్నారు. సో వీరికి తగ్గ కథ సెట్ చేయాలంటే కత్తిమీద సామే. రాజమౌళి అనే అంశంతో పాటు ఎన్టీఆర్, చరణ్ మధ్య ఫ్రెండ్ షిప్ బాండింగ్ ఉండటంతో ‘ఆర్ఆర్ఆర్’ ఆడుతూ పాడుతూ చేసేశారు. ఇక ఇటీవల అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాల్లో చిరంజీవి, అరవింద్ ఫ్యామిలీస్ సందడి చేసినా రామ్ చరణ్ లేకపోవడం గమనించాల్సిన విషయమే. బయటకు తమ ఫ్యామిలీస్ మధ్య ఏమీ లేదని చెబుతున్నా చరణ్, బన్నీ మధ్య సమ్ థింగ్ గోయింగ్ ఆన్ అని గట్టిగానే వినిపిస్తోంది. బాలీవుడ్‌లో అప్పుడెపుడో సల్మాన్‌ఖాన్, షారుక్ ఖాన్ హీరోలుగా ‘కరణ్ అర్జున్’ రూపొంది ఘన విజయం సాధించింది. అదే సౌండింగ్ ఉన్న ‘చరణ్ అర్జున్’ సినిమా రూపొందితే మాత్రం రికార్డులను తిరగరాసే అవకాశం ఉంటుంది. అయితే అందుకు చరణ్, బన్నీ తమ తమ ఇగోలను పక్కన పెట్టి పని చేయాల్సి ఉంటుంది. అది సాధ్యమేనా అంటే చిత్రపరిశ్రమలో సాధ్యం కానిది ఏదీ లేదు. ఇక్కడ అంతా సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. మరి ‘చరణ్ అర్జున్’ను తెరమీదకు తీసుకువెళ్ళే దర్శకుడు ఎవరో చూద్దాం.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!