Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ‘లైగర్’ ఘోర పరాజయం నుంచి ఇంకా తేరుకున్నట్లు లేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అటు పూరీకి, ఇటు విజయ్‌కు పూర్తిగా నిరాశ పరిచింది. ఆగస్ట్ 25వ తేదీన ‘లైగర్’ విడుదలైంది. ఈ సినిమా పరాజయం విజయ్ దేవరకొండకు పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఆ తర్వాత విజయ్ ఏ పబ్లిక్ వేదికలో కనిపించలేదు. తాజాగా ‘ప్రిన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మెరిశాడు. అయితే తన రెగ్యులర్ శైలికి భిన్నంగా ప్రశాంతంగా కనిపించాడు.
సాధారణంగా దూకుడు చూపించే విజయ్ తన స్పీచ్‌లో ఎలాంటి హై పిచ్ లేకుండా ఎమోషన్ చూపించాడు. శివకార్తికేయన్ గురించి చెబుతూ ‘ఓ సందర్భంలో వేదికపై శివ కార్తీకేయన్ కన్నీళ్ళు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. నిజానికి నటీనటులు సినిమాను ఊపిరిగా భావిస్తూ సినిమానే తింటారు. సినిమానే జీవితంగా భావిస్తారు. ప్రేమిస్తారు’ అని నొక్కి చెబుతూ మాట్లాడిన వైనం అందరినీ ఆకట్టుకుంది. తన స్పీచ్‌లో ‘లైగర్’ పరాజయం తనని ఎంతగా బాధించిందో ఇన్ డైరెక్ట్‌గా చెప్పినట్లు అనిపించింది. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ వీలైనంత త్వరగా తన బాధని మర్చిపోవాలని, అలాగే ‘ఖుషీ’తో బౌన్స్ బ్యాక్ అయి గ్రాండ్ సక్సెస్ కొడతారని ఆశిద్దాం.
Read Also: Ori Devuda: అక్కడ గౌతమ్ మీనన్.. మరి ఇక్కడ?