తెలుగు చలనచిత్రసీమలో మరపురాని చిత్రాలను అందించిన అరుదైన సంస్థల్లో ‘అన్నపూర్ణ పిక్చర్స్’ స్థానం ప్రత్యేకమైనది. తమ తొలి చిత్రం ‘దొంగరాముడు’తోనే ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించిన ‘అన్నపూర్ణ’ సంస్థ నిర్మించిన రెండవ సినిమా ‘తోడికోడళ్ళు’. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు. అక్కినేనితో ఆదుర్తి తెరకెక్కించిన తొలి చిత్రమిదే. ఈ సినిమా ఘనవిజయం తరువాత ఏయన్నార్, ఆదుర్తి కాంబినేషన్ లో అనేక జనరంజక చిత్రాలు రూపొందాయి. 1957 జనవరి […]
‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ చిత్రాల ఘనవిజయంతో నందమూరి బాలకృష్ణ ‘నటసింహం’గా అభిమానులకు ఆనందం పంచారు. ఆ రెండు చిత్రాలు ‘ఇండస్ట్రీ హిట్స్’ గా నిలవడమే కాదు, అనేక రికార్డులు నెలకొల్పాయి. వాటిలో ‘సమరసింహారెడ్డి’కి కో-డైరెక్టర్ గా పనిచేసిన గొట్టిముక్కల రామ్ ప్రసాద్ తరువాత బాలకృష్ణ సినిమాతోనే దర్శకుడు కావాలని ఆశించారు. అయితే తొలుత ‘చిరునవ్వుతో’ సినిమాతో మెగాఫోన్ పట్టి, ఆ పై బాలకృష్ణ హీరోగా ‘సీమసింహం’ తెరకెక్కించారు రామ్ ప్రసాద్. 2002 జనవరి 11న ‘సీమసింహం’ జనం ముందు […]
ఆంగ్ల నూతన సంవత్సరంలో తెలుగు వాళ్ళు జరుపుకునే తొలి పండగ సంక్రాంతి. సంస్కృతి సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు పెద్ద పీట వేసే పండగ ఇది. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ… అంటూ నాలుగు రోజుల పాటు ఈ పండగ చేసుకుంటారు. అయితే రొటీన్ కు భిన్నంగా ఈసారి కేరళ ఆచార వ్యవహారాలను తెలుగువారికి పరిచయం చేసే పని పెట్టుకుంది జీ తెలుగు ఛానెల్. ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ అని, ‘ఫుడ్ బౌల్ ఆఫ్ సౌత్’ అని కేరళలను […]
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వయసు ఎంతో మీకు తెలుసా?! 70 సంవత్సరాలు!! చిత్రం ఏమంటే… ఆయనతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఎంతో మంది హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు, మరి కొందరు సినిమా రంగం నుండే తప్పుకున్నారు. మమ్ముట్టిని ఇప్పటికీ 70 సంవత్సరాల వ్యక్తిగా అంగీకరించడానికి ఎవరి మనసూ ఒప్పుకోదు. ఇటీవల మమ్ముట్టి తాను డిగ్రీ చదివిన ఎర్నాకులం మహారాజా కాలేజీ రీ-యూనియన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందులో అతని క్లాస్ మేట్స్ తో కలిసి కొన్ని ఫోటోలు దిగాడు. […]
ఈ యేడాది ప్రారంభంలోనే ఆది సాయికుమార్ నటించిన ‘అతిథి దేవో భవ’ చిత్రం విడుదలైంది. ఇదే సమయంలో అతను నటిస్తున్న దాదాపు ఐదారు చిత్రాలు సెట్స్ పై వివిధ దశలలో ఉన్నాయి. వాటిలో ఒకటి ‘తీస్ మార్ ఖాన్’. ఇటీవల షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు సోమవారం మొదలయ్యాయి. అతిత్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ విషయంలో డిఫరెంట్‌గా దూసుకుపోతోంది ‘తీస్ మార్ ఖాన్’ టీమ్. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పుష్ప’ థియేటర్లలో డిసెంబర్ 17న విడుదలైంది. ఈ చిత్రం దక్షిణాది భాషల్లో జనవరి 7న ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. విశేషం ఏమంటే… థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసిన జనం ఓటీటీలో మరోసారి చూశారు. అంతేకాదు… ఓటీటీలో తొలిసారి చూసిన వారు మరోసారి థియేటర్లకు వెళ్ళీ చూస్తున్నారు. ఫలితంగా శని, ఆదివారాల్లో పలు చోట్ల ఈ సినిమా కలెక్షన్లు పెరిగినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే… […]
వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, ’30 వెడ్స్ 21′ ఫేమ్ చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ముఖచిత్రం’. సోమవారం ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి టీమ్ కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. ‘కలర్ ఫొటో’ మూవీ తో హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ రాజ్ ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. కాల భైరవ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. […]
సంక్రాంతి బరిలో దిగాల్సిన సిద్ధు జొన్నలగడ్డ మూవీ ‘డి.జె. టిల్లు’ విడుదల వాయిదా పడింది. వైరస్ విపరీతంగా స్ప్రెడ్ కావడంతో పాటు మూవీ కోర్ టీమ్ లోని కొందరు కరోనా బారిన పడటంతో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని మీడియాకు తెలియచేశారు. మూవీ విడుదల ఎప్పుడు చేసేది త్వరలో తెలియచేస్తామని అన్నారు. సంక్రాంతి బరి నుండి ‘ట్రిపుల్ ఆర్’ మూవీ తప్పుకోగానే జనవరి 14న తమ ‘డి.జె. టిల్లు’ను విడుదల చేస్తామని […]
ప్రముఖ నటి ఖుష్బూ సైతం కొవిడ్ 19 బారిన పడింది. ఇటు నటన, అటు రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉంటున్న ఖుష్బూ ఈ మధ్యకాలంలో ఢిల్లీ కూడా చుట్టొచ్చింది. కరోనా రెండు వేవ్ లను తప్పించుకున్న తాను చివరకు దానికి దొరికిపోయానంటూ ఖుష్బూ సోషల్ మీడియాలో కొద్ది సేపటి క్రితం ప్రకటించింది. ఆదివారం సాయంత్రం వరకూ తాను నెగెటివ్ లోనే ఉన్నానని, కొద్దిగా జలుబు ఉన్న కారణంగా ఈ రోజు చేయించుకున్న పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చిందని […]
బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయన – షణ్ముఖ్ బ్రేకప్ తో అందరి దృష్టి గత యేడాది విడిపోయిన జంటలపై పడింది. దీప్తి సునయన తన బ్రేకప్ వార్తను అధికారికంగా జనవరి 1న ప్రకటించిన తర్వాత వారిద్దరి తప్పొప్పులపై బాగానే చర్చ జరిగింది. బిగ్ బాస్ షోకు ఇప్పటికే వెళ్ళి వచ్చిన దీప్తి సునయనకు అక్కడ ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలియదా? అని కొందరు ప్రశ్నిస్తుంటే, దీప్తిని ప్రేమించిన షణ్ముఖ్ కేవలం విజేతగా మారేందుకే సిరితో లవ్వాట […]