కథల ఎంపిక విషయంలో హీరోలందరూ దాదాపు తన సొంత నిర్ణయాలే తీసుకుంటారు. చుట్టుపక్కల వారి సలహాలు ఏమాత్రం తీసుకోరు. ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం ఉంటుంది కాబట్టి, నలుగుర్నీ అడిగితే నాలుగు విధానాల సమాధానాలు వస్తాయి. అప్పుడు ఆ ప్రాజెక్ట్ చేయాలా? వద్దా? అనే విషయంపై మరింత కన్ఫ్యూజన్ నెలకొంటుంది. అందుకే, సొంత నిర్ణయం మీదే కథానాయకులు ఆధారపడతారు. తానూ ఆ కోవకి చెందినవాడినేనని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు.
‘‘ఫలక్‌నుమా దాస్, పాగల్ సినిమాల్లో ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్న విశ్వక్‌సేన్.. అర్జున్ కుమార్ లాంటి సాఫ్ట్ రోల్‌ని ఎలా ఒప్పుకున్నారు? ఈ రోల్‌లో నన్ను రిసీవ్ చేసుకుంటారా? లేదా అని ఆలోచించలేదా? ఈ మేటర్‌లో ఎవరి సలహా అయినా తీసుకున్నారా?’’ అని యాంకర్ ప్రశ్నించగా.. తనకు అలాంటి లెక్కలు వేసుకోవడం రాదని ఖరాఖండీగా తేల్చి చెప్పేశాడు. జనాలు రిసీట్ చేసుకుంటారా, లేదా? ఈ సినిమా చేసిన తర్వాత ఆ సినిమా చేయడం కరెక్టా, కాదా? వంటి లెక్కలు తాను వేసుకోనని.. అలా వేసుకుంటే చాలా కన్ఫ్యూజ్ అవుతానని అన్నాడు.
ఇదే సమయంలో ఇతరుల సలహా తీసుకుంటే, తాను మరింత గందరగోళానికి గురవుతానని పేర్కొన్నాడు. అందుకే, సినిమాల ఎంపిక విషయంలో తాను ఏ ఒక్కరి సలహా తీసుకోనని, అసలు అవసరమే లేదని తెలిపాడు. తాను కథ విన్నాక ఆడియన్‌గా ఎగ్జైట్ అయితే తాను ఒప్పుకుంటానని, ఎలాంటి పాత్రైనా చేస్తానని చెప్పాడు. ముఖచిత్రం సినిమా కథ నచ్చడం వల్లే, అందులో తాను లాయర్‌గా కేమియో రోల్ చేయడానికి సిద్ధమయ్యానని విశ్వక్ క్లారిటీ ఇచ్చాడు.