Keerthy Suresh: మహానటి తర్వాత పూర్తిగా బ్లాంక్ అయ్యా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహానటి సినిమాతో కీర్తి సురేశ్ కెరీర్ ఎలా మలుపు తిరిగిందో అందరికీ తెలుసు! అప్పటివరకూ అందరు హీరోయిన్లలాగే ఈమెను కన్సిడర్ చేసిన జనాలు.. మహానటి తర్వాత ఆ అందరి కంటే భిన్నంగా చూడడం మొదలుపెట్టారు. ఈమెపై ఎనలేని గౌరవం పెరిగింది. అలనాటి సావిత్రిని అచ్చుగుద్దినట్టు అద్భుత ప్రదర్శన కనబర్చడంతో.. ఈ తరం మహానటిగా కీర్తి గడించింది. ఇలా అనూహ్యమైన క్రేజ్ వచ్చినప్పుడు, ఎవ్వరైనా క్రేజీ ప్రాజెక్టులు చేయాలని అనుకుంటారు. కీర్తి కూడా అలాగే అనుకొని, తనకొచ్చిన ఫీమేల్-సెంట్రిక్ సినిమాల్ని చేసుకుంటూ పోయింది. కానీ, ఏదీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.
అటు.. చేసిన అరకొర కమర్షియల్ చిత్రాలు కూడా బోల్తా కొట్టడంతో, కీర్తికి ఐరన్ లెగ్ అనే పేరు వచ్చింది. ఎంత తక్కువ కాలంలో మహానటిగా ఎదిగిందో, అంతే తక్కువ కాలంలో ఐరన్ లెగ్‌గా ముద్ర వేయించుకుంది. పరిస్థితి ఎక్కడిదాకా వచ్చింది.. కీర్తి ఉంటే కచ్ఛితంగా ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని జనాలు నమ్మేదాకా! ఇక కీర్తి ప్రస్థానం ఇలాగే సాగుతుందేమోనని జనాలు దాదాపు ఫిక్సయ్యారు. కానీ, ‘సర్కారు వారి పాట’తో ఆ నెగెటివ్ ముద్ర పూర్తిగా తొలగిపోతుందని కీర్తి నమ్మకంగా చెప్తోంది. తనని జనాలు ఎలాగైతే చూడాలనుకుంటున్నారో, తిరిగి తాను ఆ జోన్‌లోకి వచ్చేశానని, ఇకపై కమర్షియల్ జోనర్‌లోనే సినిమాలు చేస్తానని తెలిపింది.
Also Read
నిజానికి.. మహానటి లాంటి గొప్ప విజయం సాధించిన తర్వాత తనకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక మైండ్ బ్లాంక్ అయ్యిందని కీర్తి చెప్పింది. ఆ సమయంలో తనకు ఎక్కువగా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలే వచ్చాయని, కమర్షియల్ సినిమాల ఆఫర్స్ రాలేదని, అందుకే వాటిని చేశానని తెలిపింది. అయితే, ఆ సినిమాలు చేసినందుకు తనకు ఎలాంటి రిగ్రెట్స్ లేవని, ఫలితాలతో సంబంధం లేకుండా తాను మనస్ఫూర్తిగా ఆ చిత్రాల్ని చేశానని కీర్తి క్లారిటీ ఇచ్చింది. తాను అలాంటి సినిమాలు కావాలని కోరుకోలేదని, అవే తన వద్దకు వచ్చాయని, అలా వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంది.
నిజానికి.. కమర్షియల్, ప్రయోగాత్మక చిత్రాల్ని బ్యాలెన్స్ చేయాలని తాను ప్రయత్నించానని, కానీ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయానంది. ఇప్పుడైతే తాను ఎక్కువగా కమర్షియల్ చిత్రాలపై దృష్టి పెడుతున్నానని చెప్పిన కీర్తి.. తన పుట్టినరోజు సందర్భంగా మహేశ్ బాబు చెప్పినట్టు కచ్ఛితంగా ‘సర్కారు వారి పాట’ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని కీర్తి చెప్పింది. సాధారణ కమర్షియల్ చిత్రాలతో పోలిస్తే, ఇందులో తన పాత్ర చాలా విభిన్నమైందని, అందుకే ఇది తనకు స్పెషల్ సినిమా అని చెప్పింది. ఇక మహేశ్‌తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నానని కీర్తి చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!