‘ఉప్పెన’ వంటి బ్లాక్ బస్టర్ మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, తొలి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో ‘బేబమ్మ’గా చెరగని ముద్ర వేసుకున్నారు కృతి శెట్టి. తొలి చిత్రంతోనే విమర్శకుల ప్రశంసలు మరియు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి చిత్రాల్లో తన నటన లోని మరో కోణాన్ని ప్రదర్శించింది. అలా అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుని ‘మోస్ట్ వాంటెడ్ హీరోయిన్’గా మారింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బీజిగా ఉంది.. అయితే కృతి శెట్టి తాజాగా నాగ చైతన్య గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది..
Also Read : Jaya Bachchan : కూతురు అడిగిన ఆ ఒక్క మాటతోనే సినిమాలకు గుడ్ బై చెప్పేశా..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కృతి మాట్లాడుతూ, తన సహనటులలో నాగ చైతన్యతో పనిచేస్తున్నప్పుడు తనకు అత్యంత సౌకర్యంగా అనిపిస్తుందని వెల్లడించింది. అంతే కాదు చైతన్య లో తనకు నచ్చే ప్రధాన లక్షణం ఆయన నిజాయితీ అని, ఏ విషయాన్నైనా ఎటువంటి ‘ఫిల్టర్లు’ లేకుండా, మనసులో ఒకటి ఉంచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా చెబుతారని కృతి తెలుపుతూ.. చైతన్యన్ని ఆకాశానికి ఎత్తేసింది. ఈ జంట ‘బంగార్రాజు’, ‘కస్టడీ’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించగా, వీరిద్దరి మధ్య మంచి స్నేహం సినిమాలకు మించి ఉంటుందని కృతి మాటలను బట్టి అర్థమవుతుంది. ప్రస్తుతం కృతి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.