ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోంది. ఏఐ టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్లలో ఏఐ ఫీచర్స్ ను కలిగి ఉన్నాయి. తాజాగా టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ ఇటీవల “AI ఫోన్” నమూనాను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ మానవుడిలా పనిచేయడానికి దగ్గరి పోలిక కలిగి ఉంది. అయితే ఈ డెవలప్ మెంట్ ను చాలా మంది ప్రమాదకరమైనదిగా అభివర్ణిస్తున్నారు.
Also Read:Supreme Court: ‘ఇండిగో సంక్షోభం’ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఝలక్
బైట్‌డాన్స్ తన డౌబావో AI ఏజెంట్‌ను అభివృద్ధి చేసింది. ఇది యూజర్ల మొబైల్ స్క్రీన్‌లను పరిశీలిస్తుంది. కంట్రోల్ చేస్తుంది. ఈ ఏజెంట్లు ఎటువంటి మానవ స్పర్శ లేకుండా యాప్‌లను ఓపెన్ చేస్తాయి. యూజర్లకు ఆర్డర్‌లను కూడా ఇస్తాయి. “AI ఫోన్” కాల్స్ చేసుకోవడానికి, మెసేజ్ లు పంపడానికి, టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి కూడా సపోర్ట్ చేస్తుంది.
షెన్‌జెన్‌కు చెందిన వ్యాపారవేత్త టేలర్ ఓగన్ AI ఫోన్‌ను ప్రదర్శించే వీడియో వైరల్‌గా మారింది. అతను AI ఫోన్‌కు వాయిస్ కమాండ్‌లు ఇచ్చాడు. ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్ ఆటోమేటిక్ గా ఆ పనిని పూర్తి చేస్తుంది. నివేదికల ప్రకారం, బైట్‌డాన్స్ త్వరలో దాని AI ఫోన్‌ల ఫీచర్లను తగ్గించనుంది. తద్వారా అవి సున్నితమైన డేటాను యాక్సెస్ చేయకుండా నిరోధిస్తుంది. అయితే, ఇది కమర్షియల్ గా ఎప్పుడు ప్రారంభించబడుతుందనే దానిపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు.
Also Read:Kollywood : అమీర్ ఖాన్ – లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోలేదండోయ్
ఇది ప్రపంచంలోనే మొదటి నిజమైన స్మార్ట్‌ఫోన్. ఇది ZTE Nubia M153 ఇంజినీరింగ్ ప్రోటోటైప్, ByteDance Doubao AI ఏజెంట్‌ను Android OS లెవెల్‌లో పూర్తిగా ఫ్యూజ్ చేసింది. ఇది ఫోన్‌ను పూర్తిగా కంట్రోల్ చేస్తుంది. సిరి, అలెక్సా లాంటి వాయిస్ అసిస్టెంట్ల కంటే భిన్నంగా ఉంటుంది. వాయిస్ అసిస్టెంట్లు వాయిస్ కమాండ్‌ల ఆధారంగా యాప్‌లను యాక్టివేట్ చేస్తాయి. ఇవి ఎంపిక చేసిన ఫీచర్‌లను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తాయి. AI ఫోన్‌లలో, వాయిస్ కమాండ్‌లు మానవుడు చేసే పనులను పోలి ఉండేలా చేస్తాయి.
Another DeepSeek moment. This is the world’s first actual smart phone. It’s an engineering prototype of ZTE’s Nubia M153 running ByteDance’s Doubao AI agent fused into Android at the OS level. It has complete control over the phone. It can see the UI, choose/download apps,… pic.twitter.com/lM9PYMoQek
— Taylor Ogan (@TaylorOgan) December 4, 2025