Prashant Kishor: దేశ వ్యాప్తంగా ఆసక్తిరేపిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మహా కూటమికే కాకుండా ప్రశాంత్ కిషోర్ పార్టీ అయిన జన్ సూరజ్ పార్టీ (JSP)కి కూడా ఊహించనివి. ఈ ఎన్నికల్లో 238 సీట్లలో పోటీ చేసిన JSP ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఆ పార్టీ 236 సీట్లలో సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోయింది. అయినప్పటికీ JSP 35 సీట్లలో ఓట్లను చీల్చింది. ఈ ఎన్నికల్లో జన్ సూరజ్ పార్టీ అధికార, ప్రతిపక్ష రెండు సంకీర్ణాలకు […]
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) మరణశిక్ష విధించింది. కోర్టు ఆమెను మూడు తీవ్రమైన అభియోగాలపై దోషిగా నిర్ధారించి ఈ విధంగా తీర్పును వెలువరించింది. మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు ఆమె దోషిగా నిర్ధారించినట్లు కోర్టు పేర్కొంది. అయితే ఆమెకు ఎప్పుడు ఉరిశిక్ష అమలు చేస్తారనేది కోర్టు వెల్లడించలేదు. ఆమె ఈ శిక్షపై అప్పీల్ చేసుకోవచ్చా, దీని నుంచి తప్పించుకోవడానికి ఆమెకు చట్టపరమైన మార్గాలు ఏమైనా […]
Health Tips: ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్తో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవలి WHO నివేదిక ప్రకారం.. 1990 నుంచి 2022 మధ్య డయాబెటిస్ కేసులలో గణనీయమైన పెరుగుదల ఉందని వెల్లడించాయి. అయితే శీతాకాలంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చాలా కష్టమని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ టైంలో జలుబు, ఇన్ఫెక్షన్లు శరీరంపై ఒత్తిడిని పెంచుతాయని, ఇన్సులిన్ పనితీరును ప్రభావితం చేస్తాయని, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. READ ALSO: Heavy Rains: అమ్మబాబోయ్ మళ్లీ వర్షాలు.. […]
Bullet Baba Temple: దేవుడు సర్వాంతర్యామి.. విశ్వాసం అనేది ఒక వ్యక్తిని దేవుడిని వెతకడానికి ప్రేరేపిస్తుంది. రాజస్థాన్‌లో ఉన్న ఒక ఆలయంలో కొలువుదీరిన దేవుడిని చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే.. ఈ ఆలయంలో రాళ్లు లేదా విగ్రహాలను కాకుండా బుల్లెట్ బైక్‌లను పూజిస్తారు. ఇది వినడానికి ఆశ్చర్యకరంగా ఉండవచ్చు. కానీ ఇది నిజం.. ఈ ఆలయాన్ని ఓం బన్నా ఆలయం అంటారు. దీనిని “బుల్లెట్ బాబా ఆలయం” అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం కథ ఏంటో […]
Putin – Netanyahu: ప్రపంచ వ్యాప్తంగా సంచలన ఘటన ఒకటి చోటుచేసుకుంది. వాస్తవానికి కొన్ని దేశాలకు ఒకదానికొకటి శత్రుత్వం లేదు, కానీ ఎప్పుడు మాట్లాడుకోని ఆ దేశాలు అకస్మాత్తుగా మాట్లాడుకుంటే, అది పెద్ద సంచలనం సృష్టిస్తుంది. అచ్చంగా అలాంటి సంఘటన ఇప్పుడు జరిగింది. ఆ దేశాలు ఏంటంటే రష్యా – ఇజ్రాయెల్. ఇందులో విశేషం ఏమిటంటే ఇజ్రాయెల్ అమెరికా శిబిరంలో ఉన్నట్లు ప్రపంచం పరిగణిస్తుంది. అయితే రష్యాకు ఇజ్రాయెల్‌తో ఎటువంటి శత్రుత్వం లేదు. వాస్తవానికి మొదట్లో ఇజ్రాయెల్‌ను […]
Delhi Blast Case: ఢిల్లీ ఎర్రకోట ప్రాంతంలో జరిగిన కార్ బాంబు పేలుడు కేసులో NIA (జాతీయ దర్యాప్తు సంస్థ) ఒక పెద్ద పురోగతిని సాధించింది. ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నిన వ్యక్తిని ఈ ఏజెన్సీ అరెస్టు చేసింది. NIA అరెస్ట్ చేసిన నిందితుడి పేరు అమీర్ రషీద్ అలీ. ఈ పేలుడుకు ఉపయోగించిన కారు అతని పేరు మీద రిజిస్టర్ అయ్యింది. NIA అతన్ని ఢిల్లీలో అరెస్టు చేసింది. ఈ పేలుడుపై మొదట ఢిల్లీ పోలీసులు […]
Tej Pratap Yadav: బీహార్ రాజకీయాలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత మరింత ఆసక్తికరంగా మారాయి. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంతో పాటు పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తేజ్ పత్రాప్ యాదవ్ సొంతంగా పార్టీని స్థాపించి, దానికి జనశక్తి జనతాదళ్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో ఈ పార్టీ 22 మంది అభ్యర్థులను నిలబెట్టింది. ఎన్నికల ఫలితం అనంతరం ఆదివారం తేజ్ ప్రతాప్ యాదవ్ నివాసంలో సమీక్షా […]
Japan Volcano Eruption: జపాన్‌లో అగ్నిపర్వతం పేలింది. పశ్చిమ జపాన్ ద్వీపం క్యుషులోని సకురాజిమా అగ్నిపర్వతం వద్ద ఆదివారం తెల్లవారుజామున అనేక భారీ పేలుళ్లు సంభవించాయి. వాతావరణ సంస్థ (JMA) ప్రకారం.. మొదటి పేలుడు తెల్లవారుజామున 1 గంటలకు సంభవించింది. ఆ తరువాత ఉదయం 2:30, ఉదయం 8:50 గంటలకు మరో రెండు పేలుళ్లు సంభవించాయి. ఈ మూడు పేలుళ్లు చాలా శక్తివంతమైనవని, వీటి కారణంగా లావా, బూడిద ఆకాశంలో 4.4 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసాయని వెల్లడించింది. […]
Best Post Office Savings Plans: డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. అనే మాట గుర్తు ఉంది కదా.. అలాగే డబ్బును సంపాదిస్తే.. డబ్బే తిరిగి డబ్బును సంపాదిస్తుందనేది మాటను కూడా గుర్తుకు ఉంచుకోండి. ఈ రోజుల్లో డబ్బును సంపాదించడం సులువు కానీ.. సంపాదించిన డబ్బును సరిగ్గా పొదుపు చేయడం చాలా కష్టంగా మారిపోయింది. ఒక వైపు చూస్తే 2025 లో అనేక బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ (FD) పథకాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో […]
India WTC Ranking Drop: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఓటమి పర్యవసానాలను భారత జట్టు ప్రపంచ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో గట్టిగానే చవిచూసింది. ఓటమి అనంతరం WTC పాయింట్ల పట్టికలో టీమిండియా మూడవ స్థానం నుంచి నాల్గవ స్థానానికి పడిపోయింది. కోల్‌కత్తాలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మూడవ రోజునే భారత్‌ను 30 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో పర్యాటక జట్టు రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇదే సమయంలో ప్రపంచ […]