Kanpur Scam: పెళ్లికాని ప్రసాద్‌ల పెళ్లి చేసుకోవాలనే కలను ఒక నిత్య పెళ్లికూతురు క్యాష్ చేసుకుంది. ఈక్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పోలీసులు ఈ నిత్య వధువును అరెస్టు చేశారు. ఆమె నాలుగు సార్లు వివాహం చేసుకుంది, 12 మందికి పైగా పురుషులను వలలో వేసుకొని బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు దోచుకుందని పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు పోలీసులు మాట్లాడుతూ.. ఆమె పోలీసు అధికారులు, వైద్యులను కూడా ట్రాప్ చేసిందని, నిత్య వధువు పేరు దివ్యాన్షి […]
Leaders Sentenced: బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ సోమవారం దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఐదు ఆరోపణలలో మూడింటిలో ఆమెను కోర్టు దోషిగా తేల్చింది. అయితే మరణశిక్ష పడ్డ మొదటి ప్రధానమంత్రి ఆమె మాత్రమే కాదు. గతంలో కూడా అనేక దేశాలు అగ్ర నాయకత్వానికి మరణశిక్షలను కోర్టులు విధించాయి. ఇంతకీ ఆ దేశ అధ్యక్షులు, ప్రధాన మంత్రులు ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: IBomma Ravi […]
Off The Record : ఎమ్మెల్సీ కవిత వ్యవహారశైలి బీఆర్ఎస్కు అస్సలు మింగుడు పడటం లేదట. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక కొన్నాళ్ళు కామ్‌గా ఉన్నా… ఇటీవల తీవ్ర స్థాయిలో మాటల దాడి చేస్తున్నారామె. దాన్ని కూడా పార్టీ పెద్దలు చూసీ చూడనట్టు వదిలేసినా… ఇక ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోతోందని భావిస్తున్నారట. గిల్లి, గిచ్చి, సూదులతో గుచ్చినట్టుగా కవిత మాటలు ఉండటంతో పాటు…ఇతర పార్టీలకు ఆయుధం ఇచ్చేలా ఉంటున్నట్టు పెద్దలు ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. జాగృతి జనం […]
Off The Record : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైందా? కదనోత్సహంతో ఉన్న కాంగ్రెస్ ముందడుగు వేయాలని డిసైడ్ అయ్యిందా..!? జూబ్లీ గెలుపు ఇచ్చిన కిక్‌తో… మంచి తరుణం మించిన దొరకదనుకుంటూ… లోకల్ వార్‌కు రెడీ అయ్యిందా? కోర్ట్‌లో ఉన్న కేసు సంగతేంటి? బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయంలో ఏం చేస్తారు? READ ALSO: Ukraine – France: రష్యా వార్‌కు ఉక్రెయిన్ భారీ డీల్.. ఫ్రాన్స్ నుంచి 100 రాఫెల్ జెట్ల […]
Ukraine – France: రష్యా వార్‌లోకి ఫ్రాన్స్ రాఫెల్ యుద్ధ విమానం అడుగు పెట్టబోతుంది. రాబోయే 10 ఏళ్లలో100 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి తాజాగా ఉక్రెయిన్ ఫ్రాన్స్‌తో ఉద్దేశ్య లేఖపై సంతకం చేసిందని ఫ్రెంచ్ అధ్యక్ష భవనం ప్రకటించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఫ్రాన్స్‌ను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో రాఫెల్ ఫైటర్ జెట్లపై చర్చలు జరిపారు. రష్యా ఇటీవల ఉక్రెయిన్‌పై డ్రోన్, క్షిపణి దాడులను పెంచింది. […]
Hasina Wedding Anniversary: బంగ్లాదేశ్ మరొసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అది ఏవిధంగా అంటే బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ ICT తీర్పు వెలువరించడం ద్వారా. వాస్తవానికి షేక్ హసీనాకు నవంబర్ 17 వ తేదీతో ఎల్లప్పుడూ లోతైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఎందుకంటే నవంబర్ 17న ఆమె వివాహ వార్షికోత్సవం. ఈ రోజున ఆమె ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఎంఏ వాజెద్ మియాను వివాహం చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో బంగ్లాదేశ్ కోర్టు […]
KL Rahul: క్రికెట్లోని అన్ని ఫార్మట్లు ఒక లెక్క ఐపీఎల్ ఒక లెక్క. అలాంటి ఐపీఎల్ గురించి, టోర్నీలోని టీంల కెప్టెన్స్ గురించి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సంచలన కామెంట్స్ చేశారు. 2022-2024 మధ్య కేఎల్ రాహుల్ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. తొలి రెండు సీజన్లలో జట్టు ప్లే ఆఫ్స్‌నకు చేరగా, 2024లో ఏడో స్థానంలో నిలిచింది. ఆ సీజన్లో ఓ మ్యాచ్‌లో లఖ్‌నవూ ఓడిపోయిన తర్వాత కేఎల్ […]
Anantnag Arrest NIA: ఢిల్లీ ఎర్రకోట ప్రాంతంలో జరిగిన కార్ బాంబు పేలుడు కేసులో NIA (జాతీయ దర్యాప్తు సంస్థ) ఒక పెద్ద పురోగతిని సాధించింది. ఢిల్లీ పేలుడుకు సంబంధం ఉన్న మరో కీలక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నిన వ్యక్తి అమీర్ రషీద్ అలీని ఆదివారం NIA అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు కారు బాంబు తయారు చేసిన జసీర్ బిలాల్ వానిని అరెస్ట్ […]
Delhi blast Code Words: ఢిల్లీ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫరీదాబాద్‌లో బట్టబయలైన వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్ టెలిగ్రామ్‌లో సాధారణ ఆహార పదార్థాల పేర్లను కోడ్లుగా ఉపయోగించింది. అనుమానం రాకుండా ఉండటానికి బాంబు, దాడి కుట్రల గురించి చర్చించడానికి నలుగురు వైద్యులు తమ చాట్లలో బిర్యానీ, దావత్ వంటి పదాలను ఉపయోగించారని భద్రతా సంస్థలు గుర్తించాయి. ఇప్పటికే ముజమ్మిల్ షకీల్, ఒమర్ ఉన్ నబీ, షాహినా సయీద్, అదీల్ హమ్ రాడర్ అనే […]
Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో విచారణ ఎదుర్కొంటున్న అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఛైర్మన్ జావెద్ సిద్దిఖీ సోదరుడిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 25 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లోని మహూ ప్రాంతంలో జరిగిన ఆర్థిక మోసం కేసులో నిందితుడైన అతణ్ని హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వ్యక్తి పేరు హమూద్ అహ్మద్ సిద్దిఖీగా వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ”హమూద్ అహ్మద్ సిద్దిఖీ దాదాపు 25 ఏళ్ల క్రితం […]