2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటోంది. కాలెండర్‌లో 2025 మారిపోవడానికి ఇంకా నెల కూడా లేదు. అన్-సీజన్ అయినప్పటికీ, నవంబర్ నెలలో తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద హీరోల సందడి కనిపించలేదు. అయితే, ఈ వెలితిని భర్తీ చేస్తూ చిన్న సినిమాలు ఇబ్బడిముబ్బడిగా రిలీజ్ అయ్యాయి. నవంబర్‌లో స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలు ఏవీ విడుదల కాలేదు. దీంతో బాక్సాఫీస్ చిన్న సినిమాలకు వేదికైంది. కానీ… ఎన్ని సినిమాలు విడుదలైనా, కేవలం మూడు చిత్రాలు మాత్రమే బ్రేక్ ఈవెన్ అయ్యాయి. ఇది నవంబర్ నెల ఫలితాలకు అద్దం పడుతోంది.
Also Read :RGV-Show Man: రామ్‌గోపాల్ వర్మ హీరోగా “షో మ్యాన్”.. మాస్ లుక్‌లో ఆర్జీవీ..
నవంబర్ బ్రేక్ ఈవెన్ చిత్రాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి మూడు. మొదటిది రష్మిక ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగా ఆడి, బ్రేక్ ఈవెన్ మార్కును చేరుకుంది. రెండో చిన్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ చిన్న బడ్జెట్ చిత్రం మంచి కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుని, ఊహించని విధంగా మంచి లాభాలు కూడా సాధించింది. మూడో చిన్న సినిమా ‘ది గ్రేడ్ ప్రీ వెడ్డింగ్ షో’: ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం, విడుదల తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకుని, పెట్టుబడిని వెనక్కి తెచ్చుకోవడంలో విజయం సాధించింది.
Also Read :Kandula Durgesh: మ్యూజిక్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తాం
అయితే కొన్ని సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. అంచనాలు పెట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద చతికిలబడిన చిత్రాలలో సుధీర్‌బాబు ‘జటాధర’, కాంత సహా అల్లరి నరేశ్ ’12A రైల్వే కాలనీ’ ఉన్నాయి. ఈ సినిమాలు బ్రేక్ ఈవెన్ మార్కును అందుకోలేకపోయాయి. నవంబర్ 2025 ఫలితాలు చూస్తే, కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు అన్-సీజన్‌లో కూడా ఆదరణ లభిస్తుందని, కానీ కేవలం హడావిడి చేస్తే సరిపోదని స్పష్టమవుతోంది. మూడు సినిమాల విజయం పరిశ్రమకు కొంత ఊరటనిచ్చినా, విడుదలైన మొత్తం సినిమాల సంఖ్యతో పోలిస్తే విజయాల శాతం తక్కువగానే ఉంది.