India WTC Ranking Drop: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఓటమి పర్యవసానాలను భారత జట్టు ప్రపంచ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో గట్టిగానే చవిచూసింది. ఓటమి అనంతరం WTC పాయింట్ల పట్టికలో టీమిండియా మూడవ స్థానం నుంచి నాల్గవ స్థానానికి పడిపోయింది. కోల్‌కత్తాలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మూడవ రోజునే భారత్‌ను 30 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో పర్యాటక జట్టు రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇదే సమయంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారతదేశం 54.17 PCTని కలిగి ఉంది. ఈ WTC సైకిల్‌లో భారతదేశం ఎనిమిది టెస్ట్‌లు ఆడింది, వాటిలో నాలుగు గెలిచి, మూడింటిలో ఓడిపోయింది.
READ ALSO: Hindupuram: వైసీపీ ఆఫీసుపై దాడితో హీటెక్కిన హిందూపురం!
విజయంతో లాభపడిన దక్షిణాఫ్రికా..
కోల్‌కత్తాలో జరిగిన మొదటి టెస్ట్ మ్యా్చ్‌లో భారతదేశంపై విజయం సాధించడంతో దక్షిణాఫ్రికా బాగానే లాభపడింది. గతంలో ఈ పర్యాటక జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉండగా.. భారత్‌పై విజయం అనంతరం రెండవ స్థానానికి ఎగబాకింది. ఈ WTC సైకిల్‌లో దక్షిణాఫ్రికా జట్టు మూడు మ్యాచ్‌లు ఆడి, రెండు గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. దక్షిణాఫ్రికా PCT 66.67. దక్షిణాఫ్రికా 15 సంవత్సరాల తర్వాత భారతదేశంలో తన మొదటి టెస్ట్‌ను గెలుచుకుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇంగ్లాండ్‌లో జరిగిన రెండు టెస్టుల్లో ఓడిపోయిన తర్వాత, ప్రస్తుత WTC సైకిల్‌లో భారత్ ఇప్పుడు మూడు టెస్టుల్లో ఓడిపోయింది. గత నెలలో పాకిస్థాన్‌లో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తన టైటిల్‌ను కాపాడుకోవడానికి మంచి ఆరంభం ఇచ్చింది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా జట్టు రెండింటిలో గెలిచింది. వారు PCT 66.67 పాయింట్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నారు.
టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వంలో స్వదేశంలో 150 పరుగుల కంటే తక్కువ లక్ష్యాన్ని ఛేదించలేని రెండవ ఓటమిగా భారత్ జట్టు ఈ ఓటమిని మూటగట్టుకుంది. ఈ 21వ శతాబ్దంలో స్వదేశంలో 150 పరుగుల కంటే తక్కువ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ఏ జట్టు కూడా ఓడిపోయిన చరిత్ర లేదు. గత ఏడాది వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 3-0 తేడాతో భారత్‌ను వైట్‌వాష్ చేసిన సంగతి తెలిసిందే.
READ ALSO: Mexico Gen Z Protests: మెక్సికోలో జెన్-జెడ్ తిరుగుబాటు! రోడ్లపైకి వేలాదిగా నిరసనకారులు..