Health Tips: షుగర్ కంట్రోల్‌కు ఈ చిట్కాలను ట్రై చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health Tips: ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవలి WHO నివేదిక ప్రకారం.. 1990 నుంచి 2022 మధ్య డయాబెటిస్ కేసులలో గణనీయమైన పెరుగుదల ఉందని వెల్లడించాయి. అయితే శీతాకాలంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చాలా కష్టమని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ టైంలో జలుబు, ఇన్ఫెక్షన్లు శరీరంపై ఒత్తిడిని పెంచుతాయని, ఇన్సులిన్ పనితీరును ప్రభావితం చేస్తాయని, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి.
READ ALSO: Heavy Rains: అమ్మబాబోయ్ మళ్లీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాబోయే రెండ్రోజులు దంచుడే దంచుడు
Also Read
- Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
- Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే "మసాలా గుత్తివంకాయ" చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
శీతాకాలంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, మధుమేహ వ్యాధిగ్రస్తులు వివిధ లక్షణాలను అనుభవించవచ్చని వైద్యలు చెబుతున్నారు. శరీరం అదనపు గ్లూకోజ్‌ను నిర్వహించలేనందున అలసట, శక్తి లేకపోవడం అనిపించవచ్చని చెబుతున్నారు. ఎక్కువ నీరు తాగవలసిన అవసరం పెరగడం, మూత్రం ద్వారా అదనపు చక్కెర విసర్జించాల్సి రావడంతో తరచుగా మూత్రవిసర్జన చేయడం, తలనొప్పి, తలతిరగటం, దృష్టి మసకబారడం వంటి లక్షణాలు కనిపించవచ్చని పేర్కొన్నారు. జలుబు లేదా ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు పరిస్థితిని మరింత దిగజార్చవచ్చని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇన్ఫెక్షన్లు శరీరంలోకి ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తాయని, ఇది రక్తంలో చక్కెర స్థాయిని మరింత పెంచుతుందని వెల్లడించారు.
శీతాకాలంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కొన్ని సులభమైన, ప్రభావవంతమైన మార్గాలు ఉన్నాయని RML హాస్పిటల్‌లోని మెడిసిన్ విభాగానికి చెందిన డాక్టర్ సుభాష్ గిరి వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఎందుకంటే ఉష్ణోగ్రత, శరీర స్థితిలో మార్పులు చలి కాలంలో రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా హెచ్చుతగ్గులకు కారణమవుతాయని వెల్లడించారు. తరువాత యోగా, నడక వంటి తేలికపాటి ఇండోర్ వ్యాయామం చేయాలని సూచించారు.
అధిక చక్కెర పెరుగుదలను నివారించడానికి ఆహారంలో ప్రోటీన్, అధిక ఫైబర్ కూరగాయలు, తక్కువ శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను చేర్చుకోవాలని చెప్పారు. ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం లేదా లోతైన శ్వాస పద్ధతులను అభ్యసించాలని, తగినంత నిద్ర పొందడం కూడా అంతే ముఖ్యం అని పేర్కొన్నారు. మీరు ఇన్సులిన్ లేదా చక్కెర నియంత్రణ మందులు తీసుకుంటుంటే, శీతాకాలంలో వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం అని అన్నారు. ఎందుకంటే ఈ వాతావరణానికి మందుల మోతాదులో స్వల్ప సర్దుబాట్లు అవసరం కావచ్చని పేర్కొన్నారు. అదనంగా శీతాకాలంలో ఇన్ఫెక్షన్లను నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అంటే చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, వెచ్చని దుస్తులు ధరించడం, అవసరమైతే టీకాలు వేయడం వంటివి చేయాలని అన్నారు.
ఈ విషయాలను మర్చిపోకండి..
* డాక్టర్ సలహా మేరకు ఇన్సులిన్ లేదా మందుల మోతాదును సర్దుబాటు చేసుకోవాలి.
* రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి.
* ఇంటి లోపల తేలికపాటి వ్యాయామం కొనసాగించాలి.
* మీ దినచర్యలో సమతుల్య, పోషకమైన ఆహారాన్ని చేర్చుకోవాలి.
* ఒత్తిడిని తగ్గించడానికి, ధ్యానం లేదా విశ్రాంతి పద్ధతులను అవలంబించాలి.
* తగినంత నిద్రపోవాలి, క్రమం తప్పకుండా నిద్ర-మేల్కొనే విధానాన్ని పాటించాలి.
* ఇన్ఫెక్షన్ల నుంచి సురక్షితంగా ఉండటానికి శుభ్రతను పాటించాలి.
READ ALSO: Bullet Baba Temple: ఈ గుడిలో ఆశ్చర్యకరమైన దేవుడు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
తాజావార్తలు
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!