Cloudflare Outage: మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ట్విట్టర్) మంగళవారం సాయంత్రం భారతదేశంలో పనిచేయలేదు. వేలాది మంది వినియోగదారులు తమ సొంత ఫీడ్లను వీక్షించడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. అవుట్‌టేజ్ మానిటరింగ్ వెబ్సైట్, డౌన్‌డెటెక్టర్ కూడా X డౌన్‌టైమ్‌ను నిర్ధారించింది. X వెబ్‌సైట్‌ను తెరవడం వల్ల పేజీ రిఫ్రెష్ కాలేదు, దీనితో వినియోగదారులు దాన్ని మళ్లీ రిఫ్రెష్ చేయవలసి వచ్చింది. READ ALSO: Nandyal: బ్యాంక్ సిబ్బందిని నిర్బంధించిన రైతులు.. బయట పడిన నకిలీ బంగారం బాగోతం […]
Maoist Top Commanders: దేశంలో ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల త్రి-రాష్ట్ర సరిహద్దులో జరుగుతున్న ఒక ప్రధాన ఆపరేషన్‌లో నక్సల్ ఫ్రంట్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్ర కమాండర్ మాద్వి హిడ్మాను భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేశాయి. హిడ్మా ఎన్‌కౌంటర్‌తో భద్రతా బలగాలు మిగిలిన అగ్ర నక్సలైట్లలో భయాందోళనలను విజయవంతం సృష్టించాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పుడు మావోయిస్టు పార్టీలో బతికి ఉన్న […]
Lava Agni 4: దేశీయ మొబైల్ ఫోన్ బ్రాండ్ లావా కంపెనీ త్వరలో తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ లావా అగ్ని 4 ను విడుదల చేయనుంది. ఈ క్రమంలో కంపెనీ ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించింది. లాంచ్‌కు ముందు, కంపెనీ లావా అగ్ని 4 కు ముందస్తు యాక్సెస్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. అంటే మీరు ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు దాన్ని యూజ్ చేయవచ్చు. ఈ సరికొత్త ప్రచారానికి లావా.. బ్రాండ్ డెమో@హోమ్ అని పేరు పెట్టింది. ఈ […]
Model Tenancy Act 2025: ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడన్నారు పెద్దలు. ఎందుకంటే ఇవి రెండు కూడా చాలా ఖర్చులతో కూడుకున్నవి. ఈ ఖర్చులను సరిగ్గా అర్థం చేసుకొని సవ్యంగా ఖర్చు చేస్తే డబ్బు దుబారాను తగ్గించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే అద్దె ఇంటి ఖర్చులు కూడా పెరిగిపోతుందడంతో ఈ దుబారాను తగ్గించుకోవడంపై ప్రత్యేక దృష్టిసారించాలని నిపుణులు పేర్కొన్నారు. అందులో భాగంగా ఇటీవల కేంద్రం ఇంటి అద్దె నియమాలు 2025 మోడల్ టెనెన్సీ చట్టాన్ని […]
US Student Visa Issues: ఎంతో మంది విద్యార్థులకు కలల దేశం అమెరికా. ఉన్నత చదువులు చదువుకోడానికి విద్యార్థుల గమ్యస్థానంగా పరిగణించబడే అమెరికాలో యూనివర్సిటీలకు 2024–25 విద్యా సంవత్సరంలో భారత విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య భారీగా తగ్గిందని పలు నివేదికలు వెల్లడించాయి. ఇటీవల అమెరికా రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో “ఓపెన్ డోర్స్” అనే ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో యూఎస్‌లోని యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో భారత విద్యార్థుల నమోదు 10 శాతానికి పడిపోయిందని వెల్లడైంది. 2025లో […]
Kanpur Scam: పెళ్లికాని ప్రసాద్‌ల పెళ్లి చేసుకోవాలనే కలను ఒక నిత్య పెళ్లికూతురు క్యాష్ చేసుకుంది. ఈక్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పోలీసులు ఈ నిత్య వధువును అరెస్టు చేశారు. ఆమె నాలుగు సార్లు వివాహం చేసుకుంది, 12 మందికి పైగా పురుషులను వలలో వేసుకొని బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు దోచుకుందని పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు పోలీసులు మాట్లాడుతూ.. ఆమె పోలీసు అధికారులు, వైద్యులను కూడా ట్రాప్ చేసిందని, నిత్య వధువు పేరు దివ్యాన్షి […]
Leaders Sentenced: బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ సోమవారం దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఐదు ఆరోపణలలో మూడింటిలో ఆమెను కోర్టు దోషిగా తేల్చింది. అయితే మరణశిక్ష పడ్డ మొదటి ప్రధానమంత్రి ఆమె మాత్రమే కాదు. గతంలో కూడా అనేక దేశాలు అగ్ర నాయకత్వానికి మరణశిక్షలను కోర్టులు విధించాయి. ఇంతకీ ఆ దేశ అధ్యక్షులు, ప్రధాన మంత్రులు ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: IBomma Ravi […]
Off The Record : ఎమ్మెల్సీ కవిత వ్యవహారశైలి బీఆర్ఎస్కు అస్సలు మింగుడు పడటం లేదట. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక కొన్నాళ్ళు కామ్‌గా ఉన్నా… ఇటీవల తీవ్ర స్థాయిలో మాటల దాడి చేస్తున్నారామె. దాన్ని కూడా పార్టీ పెద్దలు చూసీ చూడనట్టు వదిలేసినా… ఇక ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోతోందని భావిస్తున్నారట. గిల్లి, గిచ్చి, సూదులతో గుచ్చినట్టుగా కవిత మాటలు ఉండటంతో పాటు…ఇతర పార్టీలకు ఆయుధం ఇచ్చేలా ఉంటున్నట్టు పెద్దలు ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. జాగృతి జనం […]
Off The Record : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైందా? కదనోత్సహంతో ఉన్న కాంగ్రెస్ ముందడుగు వేయాలని డిసైడ్ అయ్యిందా..!? జూబ్లీ గెలుపు ఇచ్చిన కిక్‌తో… మంచి తరుణం మించిన దొరకదనుకుంటూ… లోకల్ వార్‌కు రెడీ అయ్యిందా? కోర్ట్‌లో ఉన్న కేసు సంగతేంటి? బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయంలో ఏం చేస్తారు? READ ALSO: Ukraine – France: రష్యా వార్‌కు ఉక్రెయిన్ భారీ డీల్.. ఫ్రాన్స్ నుంచి 100 రాఫెల్ జెట్ల […]
Ukraine – France: రష్యా వార్‌లోకి ఫ్రాన్స్ రాఫెల్ యుద్ధ విమానం అడుగు పెట్టబోతుంది. రాబోయే 10 ఏళ్లలో100 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి తాజాగా ఉక్రెయిన్ ఫ్రాన్స్‌తో ఉద్దేశ్య లేఖపై సంతకం చేసిందని ఫ్రెంచ్ అధ్యక్ష భవనం ప్రకటించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఫ్రాన్స్‌ను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో రాఫెల్ ఫైటర్ జెట్లపై చర్చలు జరిపారు. రష్యా ఇటీవల ఉక్రెయిన్‌పై డ్రోన్, క్షిపణి దాడులను పెంచింది. […]