Prashant Kishor: దేశ వ్యాప్తంగా ఆసక్తిరేపిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మహా కూటమికే కాకుండా ప్రశాంత్ కిషోర్ పార్టీ అయిన జన్ సూరజ్ పార్టీ (JSP)కి కూడా ఊహించనివి. ఈ ఎన్నికల్లో 238 సీట్లలో పోటీ చేసిన JSP ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఆ పార్టీ 236 సీట్లలో సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోయింది. అయినప్పటికీ JSP 35 సీట్లలో ఓట్లను చీల్చింది. ఈ ఎన్నికల్లో జన్ సూరజ్ పార్టీ అధికార, ప్రతిపక్ష రెండు సంకీర్ణాలకు హాని కలిగించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రతిపక్షాలు ఈ పార్టీని బీజేపీ ఏజెంట్ అని ఆరోపించాయి. కానీ ఈ పార్టీ అభ్యర్థులు రెండు సంకీర్ణాల తరుఫున పోటీలో నిలిచిన అభ్యర్థుల ఓట్లను గణనీయంగా చీల్చారు. ఈ ఎన్నికల్లో JSP ఎఫెక్ట్ బలంగా ఎవరికి తగిలిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Temba Bavuma: 148 ఏళ్ల చరిత్రలోనే ‘ఒకే ఒక్కడు’ టెంబా బవుమా!
బీహార్ ఎన్నికల ఫలితాలకు ప్రశాంత్ కిషోర్ ఎఫెక్ట్..
ఎన్నికల ప్రచారంలో ప్రశాంత్ కిషోర్ ర్యాలీలకు వచ్చిన జనసమూహాన్ని పరిశీలిస్తే, కొందరు విశ్లేషకులు ఆయన బీజేపీ ఓట్లను చీల్చుతారని చెప్పాగా, మరికొందరు ప్రభుత్వ వ్యతిరేక యువత ఓటును చీల్చుతారని అభిప్రాయపడ్డారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం గమనిస్తే ఒక కూటమి కచ్చితంగా ఆయన ప్రభావం నుంచి ఎక్కువ ప్రయోజనం పొందిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీ పోటీ చేసిన 238 సీట్లలో 236 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది.
కానీ ఈ పోర్టీ పోటీ చేసిన అనేక చోట్ల ఇతర ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయ అవకాశాలను గణనీయంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. 35 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆ పార్టీ ఓట్ల వాటా గెలుపు ఆధిక్యాన్ని మించిపోయింది. వీటిలో NDA 19 సీట్లు గెలుచుకోగా, మహా కూటమి 14 సీట్లు గెలుచుకుంది. ప్రశాంత్ కిషోర్ పార్టీ అభ్యర్థుల కారణంగా AIMIM, BSP పార్టీలు కూడా లాభపడ్డాయి. ఈ ఎన్నికల్లో జన్ సూరజ్ పార్టీకి పోలైన ఓట్ల వాటా 8.3 శాతం. ఈ ఓట్లను గమనిస్తే ఇది కాంగ్రెస్ కంటే మెరుగైనదిగా చెబుతున్నారు. అయితే ఈ పార్టీ సాధించిన ఓట్ల వల్ల ఏ పార్టీ వారికి ఎక్కువగా లాభం జరిగిందో కచ్చితంగా చెప్పడం కష్టం అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే పీకే పార్టీకి వచ్చిన ఓట్లు ఏ పార్టీకి గండి కొట్టాయో చెప్పడం అసాధ్యంగా పేర్కొన్నారు. ఈ పార్టీ 115 సీట్లలో మూడవ స్థానంలో, ఒక సీటులో రెండవ స్థానంలో నిలిచింది. పీకే పార్టీకి వచ్చిన ఓట్ల కారణంగా జేడీయూ 10 సీట్లు, బీజేపీ ఐదు సీట్లు గెలుచుకుంది. మహా కూటమిలో ఆర్జెడి తొమ్మిది సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ రెండు సీట్లు గెలుచుకుంది. సీపీఎం, సీపీఐఎంఎల్-ఎల్, ఐఐపీ ఒక్కొక్క సీటు గెలుచుకున్నాయి. ఈ కారణంగా జన్ సూరజ్ పార్టీ ప్రధానంగా పోటీలో నిలిచిన ఇరు పక్షాల్లో విశేషంగా ఏ ఒక్క కూటమికి నష్టం చేసిందో చెప్పడం కష్టంగా అభివర్ణించారు. అయితే మహాఘట్‌బంధన్‌కు మాత్రం పీకే ఎఫెక్ట్ తగిలిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పోటీలో నిలవడం కారణంగా బీజేపీ-జేడియూ కూటిమికి కలిసి వచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
READ ALSO: Sheikh Hasina: బంగ్లా మాజీ ప్రధాని హసీనా మరణశిక్షను ఆపగల మార్గాలు ఇవే..