Delhi blast Code Words: ఢిల్లీ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫరీదాబాద్‌లో బట్టబయలైన వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్ టెలిగ్రామ్‌లో సాధారణ ఆహార పదార్థాల పేర్లను కోడ్‌లుగా ఉపయోగించింది. అనుమానం రాకుండా ఉండటానికి బాంబు, దాడి కుట్రల గురించి చర్చించడానికి నలుగురు వైద్యులు తమ చాట్‌లలో బిర్యానీ, దావత్ వంటి పదాలను ఉపయోగించారని భద్రతా సంస్థలు గుర్తించాయి. ఇప్పటికే ముజమ్మిల్ షకీల్, ఒమర్ ఉన్ నబీ, షాహినా సయీద్, అదీల్ హమ్ రాడర్ అనే నలుగురు వైద్యులు తమ వైద్య లైసెన్స్‌లను కోల్పోయారు. ఏజెన్సీల నివేదికల ప్రకారం.. ఈ వ్యక్తులు ఆహారం గురించి చర్చిస్తున్నట్లు కనిపించారు, కానీ వాస్తవానికి బాంబు దాడులకు సిద్ధమవుతున్నారని వెల్లడించారు.
READ ALSO: Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసు.. హైదరాబాద్‌లో ఒకరి అరెస్ట్
బిర్యానీ – విందు అంటే ..
దర్యాప్తులో బిర్యానీ అంటే పేలుడు పదార్థం అని, విందు అంటే దాడి జరిగిన రోజు అని తేలిందని ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి. మేము సిద్ధంగా ఉన్నప్పుడు, ” బిర్యానీ సిద్ధంగా ఉంది, విందుకు సిద్ధంగా ఉండండి ” అని ఉగ్రవాదులు సందేశం పంపించారని పలువురు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. ఈ మాడ్యూల్ వెనుక ప్రధాన సూత్రధారి జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్‌కు చెందిన ఇమామ్ ఇర్ఫా అహ్మద్‌గా వెల్లడించారు. 2020లో ఆయన తన బిడ్డ అంత్యక్రియలకు హాజరు కావడానికి శ్రీనగర్‌లోని ఒక ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ ఆయన చాందినీ చౌక్‌కు కార్ బాంబును డెలివరీ చేసిన వ్యక్తి నబీని కలిశాడని పేర్కొన్నారు.
వైద్య చికిత్స కోసం ఇర్ఫాన్ పదే పదే ఆసుపత్రికి వెళ్లేవాడని, ఈ సమయంలో అతను నబీని తీవ్రవాదం వైపు మళ్లించాడని అధికారులు తెలిపారు. తరువాత నబీ సమర్థులైన మరికొందరు వైద్యులను గుర్తించి, వారిని ఇర్ఫాన్‌కు పరిచయం చేసి, టెలిగ్రామ్ ద్వారా వారికి ఉగ్రవాదం వైపు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాడని వెల్లడించారు. దక్షిణ కాశ్మీర్‌లో పాకిస్థాన్‌కు చెందిన జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులను కలవడానికి ఈ వైద్యులను ఇర్ఫాన్ ఏర్పాటు చేసినప్పుడు అసలు కథ మలుపు తిరిగింది. వైద్యులు నుంచి పోలీసులు రెండు AK- సిరీస్ రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఒకటి షాహినా సయీద్ కారులో గుర్తించారు.
దర్యాప్తులో షాహీనా సయీద్ మాట్లాడుతూ.. దాదాపు ఆరు నెలల క్రితం తాను ఇతర వైద్యులతో పరిచయం పెంచుకున్నానని, ఈ కుట్ర గురించి తనకు తెలియదని అన్నారు. అయితే మెడికల్ కౌన్సిల్ ఆ నలుగురి పేర్లను ఇండియన్ మెడికల్ రిజిస్టర్, నేషనల్ మెడికల్ రిజిస్టర్ నుంచి తొలగించింది. వారు ఇకపై వైద్యులుగా గుర్తించబడరు, దేశంలో ప్రాక్టీస్ చేయలేరు. ఇప్పటికే NIA ఢిల్లీలో కార్ బాంబుగా ఉపయోగించిన హ్యుందాయ్ i20 కారును కొనుగోలు చేసిన వ్యక్తి అమీర్ రషీద్ లీ అరెస్టు చేసింది. IEDని కారులో అసెంబుల్ చేయడంలో అతను సహాయం చేశాడని అధికారులు వెల్లడించారు.
READ ALSO: Sheikh Hasina Reaction: మరణశిక్షపై బంగ్లా మాజీ ప్రధాని హసీనా తొలి స్పందన ఇదే..