Hasina Wedding Anniversary: బంగ్లాదేశ్ మరొసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అది ఏవిధంగా అంటే బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ ICT తీర్పు వెలువరించడం ద్వారా. వాస్తవానికి షేక్ హసీనాకు నవంబర్ 17 వ తేదీతో ఎల్లప్పుడూ లోతైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఎందుకంటే నవంబర్ 17న ఆమె వివాహ వార్షికోత్సవం. ఈ రోజున ఆమె ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఎంఏ వాజెద్ మియాను వివాహం చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో బంగ్లాదేశ్ కోర్టు షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. ఇప్పుడు బంగ్లాదేశ్ కోర్టు ఈ తేదీని ఉద్దేశపూర్వక వ్యూహంలో భాగంగా ఎంచుకుందా అనే దానిపై దేశంలో తీవ్ర చర్చ జరుగుతోంది.
READ ALSO: AP Govt: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అంతర్జిల్లా బదిలీలపై ఏపీ సర్కార్ ఉత్తర్వులు..
ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్నారా..
బంగ్లాదేశ్ కోర్టు తీర్పు కోసం నవంబర్ 17వ తేదీని ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్నారా అనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద వివాదం చెలరేగింది. మొదట్లో విచారణ పూర్తయిన తర్వాత, నవంబర్ 14న ICT తీర్పు ప్రకటించింది. అయితే నవంబర్ 13వ తేదీని అకస్మాత్తుగా నవంబర్ 17కి మార్చారు. ఈ మార్పు రాజకీయ కారణాల వల్ల జరిగిందా అనేది తాజా చర్చకు ఆజ్యం పోసినట్లు అయ్యింది. బంగ్లాదేశ్ పౌరులు సోషల్ మీడియాలో రెండుగా విడిపోయి ఈ విషయంపై స్పందిస్తున్నారు. కొందరు ఇది “యాదృచ్చికం కాదు” అని, హసీనాను వ్యక్తిగతంగా అవమానించడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యూహమని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు దీనిని “దురదృష్టకర యాదృచ్చికం” అని, “రాజకీయ ప్రతీకారం” అని కామెంట్స్ చేశారు.
హసీనా పెళ్లిరోజును ఆమెకు శిక్ష విధించేలా తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహ్మద్ యూనస్ తేదీని “మోసపూరితంగా” మార్చారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. “నవంబర్ 17 హసీనా వివాహం మరణశిక్షకు దారితీసిన కథగా మారింది” అని కూడా చాలా మంది పోస్ట్‌లు పెడుతున్నారు. తీర్పు తర్వాత అవామీ లీగ్, షేక్ హసీనా ఈ మొత్తం ప్రక్రియను “రాజకీయ ప్రతీకారం”గా ఖండించారు. వారు ఐసీటీని అవామీ లీగ్‌ను రాజకీయంగా నాశనం చేయడానికి ఉద్దేశించిన “మోసపూరిత ట్రిబ్యునల్” అని అభివర్ణించారు. తనకు న్యాయమైన వాదన నిరాకరించారని, తీర్పు ముందే నిర్ణయించబడిందని హసీనా వెల్లడించారు.
షేక్ హసీనా భర్త వాజేద్ మియా..
షేక్ హసీనా భర్త ఎం.ఎ.వాజెద్ మియా కూడా పోరాటాలతో కూడిన జీవితాన్ని గడిపారు. ఆయన 1963లో పాకిస్థాన్ అణుశక్తి కమిషన్‌లో చేరారు. కానీ ఆయన ఉద్యోగం “అన్యాయంగా” రద్దు చేశారు. తరువాత 1971లో బంగ్లా స్వాతంత్ర్యం తర్వాత, ఆయన బంగ్లాదేశ్ అణుశక్తి కమిషన్‌లో చేరారు. ఆయన సైన్స్, రాజకీయాలపై అనేక ముఖ్యమైన పుస్తకాలను కూడా రాశారు.
READ ALSO: KL Rahul: ఐపీఎల్ కెప్టెన్లపై కేఎల్ రాహుల్ సంచలన కామెంట్స్!