Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో విచారణ ఎదుర్కొంటున్న అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఛైర్మన్ జావెద్ సిద్దిఖీ సోదరుడిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 25 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్లోని మహూ ప్రాంతంలో జరిగిన ఆర్థిక మోసం కేసులో నిందితుడైన అతణ్ని హైదరాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వ్యక్తి పేరు హమూద్ అహ్మద్ సిద్దిఖీగా వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ”హమూద్ అహ్మద్ సిద్దిఖీ దాదాపు 25 ఏళ్ల క్రితం మహూలో ఒక నకిలీ ప్రైవేట్ బ్యాంకును స్థాపించాడు. ప్రజల డబ్బును రెట్టింపు చేస్తామని నమ్మబలికి, వందలాది మంది ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాడు. ఈ స్కామ్ బయటపడగానే 2000వ సంవత్సరంలో తన కుటుంబంతో సహా మహూ నుంచి పరారయ్యాడు” అని వెల్లడించారు. అప్పటి నుంచి పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారని, ఈక్రమంలో హమూద్‌ను హైదరాబాద్లో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. హమీద్ లో-ప్రొఫైల్ను మెయింటైన్ చేస్తూ షేర్ ట్రేడింగ్ చేస్తున్నాడని వారు వెల్లడించారు.
READ ALSO: Balakrishna – Gopichand : బాలయ్య-గోపీచంద్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్
ఢిల్లీ ఎర్రకోట ప్రాంతంలో జరిగిన కార్ బాంబు పేలుడు కేసులో తాజాగా NIA (జాతీయ దర్యాప్తు సంస్థ) ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నిన వ్యక్తిని అరెస్టు చేసింది. NIA అరెస్ట్ చేసిన నిందితుడి పేరు అమీర్ రషీద్ అలీ. ఈ పేలుడుకు ఉపయోగించిన కారు అతని పేరు మీద రిజిస్టర్ అయ్యింది. NIA అతన్ని ఢిల్లీలో అరెస్టు చేసింది. ఇప్పటికే అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఛైర్మన్ జావెద్ సిద్దిఖీ ఢిల్లీ పేలుడు కేసులో విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన సోదరుడిని మధ్యప్రదశ్ పోలీసులు హైదరాబాద్‌లోఅరెస్ట్ చేయడం ఒక్కసారిగా సంచలనం సృష్టించింది.
READ ALSO: Nick Jonas: వారణాసి సినిమాపై ప్రియాంక చోప్రా భర్త ఫస్ట్ రియాక్షన్ ఇదే!