Duleep Trophy 2025: రజత్ పటీదార్ కెప్టెన్సీ మాయ.. దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్!
- మరోసారి రజత్ పటీదార్ కెప్టెన్సీ మాయ
- దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్
- రాత మారినట్లే అని ఆర్సీబీ ఫాన్స్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా బ్యాటర్ రజత్ పటీదార్ తన కెప్టెన్సీ మాయను మరోసారి చూపాడు. ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ను విజేతగా నిలిపిన పటీదార్.. దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీ 2025లో సెంట్రల్ జోన్‌కు టైటిల్ అందించాడు. ఫైనల్‌లో సౌత్ జోన్ నిర్దేశించిన 65 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సెంట్రల్ జోన్ ఏ వికెట్లను కోల్పోయి ఛేదించింది. పటీదార్ నాయకత్వంలో వరుసగా రెండో టైటిల్‌ను సెంట్రల్ జోన్ గెలిచింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్‌లో మ్యాచ్ జరగగా.. యశ్ రాథోడ్ (194) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సెంట్రల్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సారాన్ష్ జైన్ 5, కుమార్ కార్తికేయ 4 దెబ్బకు సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే ఆలౌటైంది. సౌత్ జోన్ బ్యాటర్లలో తన్మయ్ అగర్వాల్ (31) టాప్ స్కోరర్. ఆపై సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 511 రన్స్ చేసింది. యశ్ రాథోడ్ (194) భారీ సెంచరీ చేయగా.. రజత్ పటీదార్ (101) శతకం బాదాడు. అంకిత్ శర్మ 4, గుర్జప్‌నీత్ సింగ్ 4 వికెట్స్ తీశారు.
Also Read
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
Also Read: IND vs PAK: పనికిమాలిన ప్లేయర్స్, డబ్బులు బొక్క.. ఇకపై మ్యాచ్ మేం చూడం!
తొలి ఇన్నింగ్స్‌లో 362 పరుగులు వెనకబడిన సౌత్ జోన్.. రెండో ఇన్నింగ్స్‌లో 426 పరుగులు చేయగలిగింది. అంకిత్ శర్మ (99), స్మరన్ రవిచంద్రన్ (67), ఆండ్రూ సిద్దార్థ్ (84) హాఫ్ సెంచరీలు బాదారు. రెండో ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్భారీ స్కోర్ చేసినా.. సెంట్రల్ జోన్ ముందు 65 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది. స్వల్ప లక్షాన్ని సెంట్రల్ జోన్ 20.3 ఓవర్లలో 4 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. వరుసగా రెండో టైటిల్ అందించిన పటీదార్‌పై ఆర్సీబీ ఫాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తన్నారు. ఇక ఆర్సీబీ రాత మారినట్లే అని కామెంట్స్ చేస్తున్నారు.
𝐂𝐞𝐧𝐭𝐫𝐚𝐥 𝐙𝐨𝐧𝐞 𝐚𝐫𝐞 𝐭𝐡𝐞 𝐃𝐮𝐥𝐞𝐞𝐩 𝐓𝐫𝐨𝐩𝐡𝐲 𝐰𝐢𝐧𝐧𝐞𝐫𝐬! 🙌
Yash Rathod hits the winning runs and finishes it off in style as Central Zone beat South Zone by 6⃣ wickets👌
A fantastic victory 👏
Scorecard ▶️ https://t.co/unz0hJ66yE#DuleepTrophy | #Final… pic.twitter.com/dLcTLrCAz7
— BCCI Domestic (@BCCIdomestic) September 15, 2025
తాజావార్తలు
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!