తెలంగాణలో అందరికి ఇష్టమైన పండుగ ‘బతుకమ్మ’ అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. బతుకమ్మ పాటల్లో తెలంగాణ భాష తియ్యదనం ఉంటుందని.. బతుకమ్మలో పేర్చేవి తోట పువ్వులు కాదు, బాట పువ్వులు అని చెప్పారు. పూలనే దేవతలుగా పూజించే పండుగ బతుకమ్మ అని.. బతుకమ్మకు గుడి లేదు, మంత్రాలు లేవు, పూజారి ఉండడు అని ఎమ్మెల్సీ దేశపతి చెప్పుకొచ్చారు. తెలంగాణ భవన్లో ఈరోజు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మహిళా నాయకులు బతుకమ్మ పాటలను విడుదల చేశారు. ఈ […]
‘మార్వాడీ హటావో’ నినాదానికి తాను వ్యతిరేకం అని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు తెలిపారు. మనమంతా భారతీయులం అని, భారతీయులంతా ఎక్కడైనా జీవించవచ్చన్నారు. అందరికి ఒక్కటే రాజ్యాంగం, అందరికీ ఒక్కటే పాస్ పోర్డ్ అని పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలలో మన తెలంగాణ వారు స్ధిర నివాసం ఏర్పచుకొన్నారని.. హటావో భీజం పెరిగి పెద్దదైతే మనమే నష్ష పోతామని, అభివృద్ధి కుంటు పడుతుందన్నారు. ఈ వివాదం ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు అని మైనంపల్లి […]
రూ.3500 కోట్ల విలువైన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనిఖీలు చేపట్టింది. శుక్రవారం ఉదయం ఏకకాలంలో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలలోని 20 ప్రాంతాల్లో దాడులు జరిగాయి. మద్యం కుంభకోణం నిందితుల సంస్థలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. లిక్కర్ స్కాంలో ఉన్న నిందితుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు జరిగాయి. నకిలీ ఇన్వాయిస్లు, పెంచిన మద్యం ధరల వెనుక భారీ స్కాం […]
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీపై మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఎప్పటికో మూడున్నర సంవత్సరాల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల గురించి కాకుండా.. త్వరలో వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గురించి కేటీఆర్ ఆలోచించాలని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో బచ్చా గాడిని పెట్టి గెలిపిస్తా అంటూ కేటీఆర్‌కి పొంగలేటి సవాల్ విసిరారు. మూడున్నర సంవత్సరాల తర్వాత నువ్వు ఇండియాలో ఉంటావా? లేదా ఫారిన్లో ఉంటావా? అంటూ విమర్శలు […]
తన రాజీనామాను ఆమోదించమని ఎమ్మెల్సీ కే.కవిత కోరారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఎమోషనల్‌గా రాజీనామా చేశారని, పునరాలోచన చేసుకోమని తాను కవితకు సూచించానని చెప్పారు. కవిత రాజీనామాపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటాను అని గుత్తా అన్నారు. నల్లగొండ జిల్లాలో చిట్ చాట్ సందర్భంగా కవిత రాజీనామాపై శాసన మండలి చైర్మన్ స్పందించారు. సొంత పార్టీపై విమర్శలు చేసిన కవితను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ […]
బంగారం ధరలు కొత్త రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే. ఇటీవలి రోజుల్లో వరుసగా పెరిగిన గోల్డ్ రేట్స్.. ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. కొన్నాళ్లుగా పెరిగినప్పుడు వేళల్లో పెరిగి.. తగ్గినపుడు మాత్రం వందల్లో మాత్రమే తగ్గుతోంది. దాంతో బంగారం ధరలు తగ్గినా పెద్దగా సంతోషపడాల్సిన పరిస్థితి లేదు. పసిడి ధరలు వరుసగా రెండు రోజలు తగ్గినా.. తులం రేటు లక్షా 11 వేల పైనే ఉంది. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.500, 24 […]
ఆసియా కప్ 2025లో భాగంగా బుధవారం దుబాయ్ వేదికగా పాకిస్థాన్, యూఏఈ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ముంగిట నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇండో-పాక్ కరచాలన వివాదానికి బాధ్యుడిగా పేర్కొంటూ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను టోర్నీ నుంచి తప్పించాలన్న తమ డిమాండ్‌కు ఐసీసీ అంగీకరించకపోవడంతో.. యూఏఈ మ్యాచ్‌ను బహిష్కరించడానికి పాక్ సిద్ధమైంది. హై డ్రామా తర్వాత రిఫరీ ఆండీ తమ జట్టుకు క్షమాపణ చెప్పినట్లు పీసీబీ ఓ ప్రకటన విడుదల చేసింది. వెంటనే […]
ఐసీసీ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ క్షమాపణలు చెప్పడంతోనే తాము ఆసియా కప్ 2025 నుంచి వైదొలగలేదు అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మోసిన్ నఖ్వి వెల్లడించారు. పీఎం సహా చాలా మంది మద్దతు తమకు ఉందని, ఆసియా కప్‌ను బహిష్కరించాలనుకుంటే పెద్ద నిర్ణయమే అవుతుందన్నారు. తాము సమస్యను పరిష్కరించడంపైనే దృష్టి పెట్టాం అని చెప్పారు. క్రీడలు, రాజకీయాలు ఎప్పటికీ ఒకటి కాదని తాము నమ్ముతున్నాం నఖ్వి తెలిపారు. నిజానికి టోర్నీ నుంచి వైదొలిగితే ఆర్థికంగా […]
తెలంగాణ రాష్ట్రంకు వాతావరణ శాఖ భారీ హెచ్చరిక జారీ చేసింది. రానున్న 3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా కరీంనగర్, ములుగు, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. తప్పనిసరి అయితేనే బయటికి రావాలని ప్రజలకు సూచింది. Also […]
ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఓ మహిళ.. తనకంటే చిన్న వయస్కుడైన యువకుడిని ప్రేమించింది. యువకుడి ప్రేమలో మునిగిపోయిన మహిళ.. ఇద్దరు పిల్లలు ఉన్నారనే సంగతే మర్చిపోయింది. విషయం భర్తకు తెలియండంతో ఆమెను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. భర్త, పిల్లలను కాదనుకున్న ఆ మహిళ.. తనకు ప్రియుడే దిక్కని నిశ్చయించుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడి ఇంటిముందు ధర్నాకు దిగింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో చోటుచేసుకుంది. కరీంనగర్‌కు చెందిన సంధ్య […]