Sampath Kumar
Author- NTV Telugu-
CM YS Jagan: నేను విన్నాను, నేను ఉన్నాను.. పెరాలసిస్ బాధితుడికి సీఎం జగన్ భరోసా!
CM YS Jagan Meets Paralysis Victim in Memantha Siddham Bus Yatra: చిత్తూరు జిల్లా సదుం మండలం సదుం గ్రామానికి చెందిన 23 ఏళ్ల ముఖేష్ రెండేళ్ల క్రితం పెరాలసిస్‌కు గురయ్యాడు. ఇప్పటికే స్తోమతకు మించి.. అప్పుల చేసి మరీ వైద్యం చేయించారు కుటుంబ సభ్యులు. అంతంతమాత్రం ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకువస్తున్న వారికి.. ముఖేష్ వైద్య ఖర్చులు తలకు మించిన భారం అయ్యాయి. ముఖేష్ వైద్యానికి మరో 15 లక్షలు అవసరం అవుతాయని డాక్టర్లు […] -
Pawan Kalyan: పవన్ కల్యాణ్ తెనాలి పర్యటన వాయిదా.. కారణం ఏంటంటే?
Pawan Kalyan’s Tenali Tour Cancelled: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెనాలి పర్యటన వాయిదా పడింది. పవన్ ఆరోగ్యం సరిగా లేనందున తెనాలి పర్యటన రద్దు అయింది. ప్రస్తుతం జనసేనాని జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని ఆయనకు వైద్యులు సూచించారు. దాంతో ఈరోజు తెనాలిలో నిర్వహించాల్సి ఉన్న రోడ్ షో, బహిరంగ సభ రద్దు అయ్యాయి. Also Read: Bharat Margani: చంద్రబాబు.. ఇప్పటికైనా మీ కడుపు మంట చల్లారిందా?: […] -
Bharat Margani: చంద్రబాబు.. ఇప్పటికైనా మీ కడుపు మంట చల్లారిందా?: ఎంపీ భరత్
రాష్ట్రంలో పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకున్నందుకు.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఇప్పటికైనా కడుపు మంట చల్లారిందో? అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కసారి అందరు గమనించండని.. అవ్వ, తాత, దివ్యాంగులను లైన్లో మళ్లీ నుంచోబెట్టిన పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ఒకవైపు వాలంటీర్లపై ఫిర్యాదు చేసి.. మళ్లీ ఇళ్ల వద్దకే పెన్షన్లు తీసుకువెళ్లాలని అధికారులను చంద్రబాబు ఎలా కోరుతున్నారు? అని ప్రశ్నించారు. వాలంటీర్లు లేకుండా ఇళ్ల […] -
Memantha Siddham Bus Yatra: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ ముఖ్యనేత!
Gangadhara Nellore TDP Leader A Harikrishna Joins in YCP: చిత్తూరులో ఏడోరోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగుతోంది. ఈరోజు అమ్మగారిపల్లి నుంచి సీఎం వైఎస్ జగన్ బయల్దేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బస్సు యాత్రలో కుప్పం నియోజకవర్గం టీడీపీ నుంచి కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అమ్మగారిపల్లె స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి […] -
AP Pension: సచివాలయాలకు క్యూ కట్టిన పెన్షన్ దారులు.. మండుటెండలో వృద్ధుల ఎదురుచూపు!
Andhra Pradesh Pension News: మరికొన్ని రోజుల్లో ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఈ సమయంలో ప్రభుత్వం చేపట్టే పలు కార్యక్రమాలు పరోక్షంగా ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశముందని భావించిన ఈసీ.. ఆంక్షలు విధించింది. ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసే బదులుగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ 3 నుంచి 6 వరకు రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ జరగనుంది. నేడు […] -
Harirama Jogaiah: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధినాయకులకో విజ్ఞప్తి అంటూ.. హరిరామ జోగయ్య లేఖ!
Harirama Jogaiah Letter: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధినాయకులకో విజ్ఞప్తి అంటూ.. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ఓ లేఖ రాశారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులును బ్రిటిష్ కాలంలోనే బీసీ కులస్తులుగా పరిగణించారని పేర్కొన్నారు. ఒక్క దామోదర సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మినహా.. మిగిలిన అగ్రకులస్తులు సీఎంగా ఉన్న రోజుల్లో బీసీ జాబితా నుండి తొలగించారన్నారు. 25 శాతం జనాభా ఉన్న కాపు కులస్తులను నమ్ముకుని […] -
Maganti Babu: ముఖ పరిచయం లేని వ్యక్తిని.. చరిత్ర కలిగిన ఏలూరులో ఎలా నిలబెడతారు?: మాగంటి బాబు
Maganti Babu Press Note: ముఖ పరిచయం, రాజకీయ అనుభవం లేని వ్యక్తిని.. చరిత్ర కలిగిన ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలా నిలబెడతారు? అని ఏలూరు మాజీ ఎంపీ, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు ప్రశ్నించారు. అసలు బీసీ అనే మాటను ఎందుకు ప్రచారంలోకి తీసుకొచ్చారని, ఎవరైనా బీసీలు తమకు ఏలూరు పార్లమెంట్ సీట్ కావాలని అడిగారా? అని మండిపడ్డారు. 4 సీట్లు ఒకే కుటుంబంలో ఇస్తే మిగతా బీసీ కులాలు అంగీకరిస్తారా? […] -
Pawan Kalyan: ఆటోలో ప్రయాణించిన పవన్ కళ్యాణ్.. డ్రైవర్ల సమస్యలపై ఆరా!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆటోలో ప్రయాణించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొండెవరంలో పర్యటించారు. రోడ్డు షోలో భాగంగా కొండెవరం వద్ద ఆటోలో పవన్ రెండు కిలోమీటర్లు ప్రయాణించారు. అధ్వాన్నపు రహదారుల్లో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ఆరా తీశారు. అధికారంలోకి వచ్చాక తమ సమస్యలు పరిష్కరించాలని జనసేనానిని డ్రైవర్లు కోరారు. Also Read: Kurnool: కర్నూలులో పోలీసుల దాష్టీకం.. కార్పొరేటర్ దుస్తులు విప్పి, లాఠీలతో కొట్టి..! ప్రతి […] -
Kurnool: కర్నూలులో పోలీసుల దాష్టీకం.. కార్పొరేటర్ దుస్తులు విప్పి, లాఠీలతో కొట్టి..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలులో పోలీసులు రెచ్చిపోయారు. ఓ కార్పొరేటర్, మరో కార్పొరేటర్ కుమారుడిని చితకబాదారు. దుస్తులు విప్పి.. లాఠీలతో కొట్టి.. కాళ్ళతో తొక్కి హింసించారు. ఎన్నికల సమావేశం ఉందని పిలిపించి ఇద్దరినీ పోలీసులు చావబాదారు. ఎలాంటి కేసులు లేకున్నా థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నారు. Also Read: 2019 World Cup: 2019 ప్రపంచకప్ ఫైనల్లో తప్పిదం చేశాం.. ఇంగ్లండ్ కప్ గెలిచేదే కాదు! అంపైర్ సంచలన వ్యాఖ్యలు వివరాల ప్రకారం… […] -
2019 World Cup: 2019 ప్రపంచకప్ ఫైనల్లో తప్పిదం చేశాం.. ఇంగ్లండ్ కప్ గెలిచేదే కాదు! అంపైర్ సంచలన వ్యాఖ్యలు
Marais Erasmus on ODI World Cup 2019 Final: 2019 ప్రపంచకప్ ఫైనల్లో తాము ఘోర తప్పిదం చేసినట్లు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మాజీ అంపైర్ మరియస్ ఎరాస్మస్ తెలిపారు. తమ తప్పిదం వల్లనే ఫైనల్ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసిందని, అసలు ఇంగ్లండ్ కప్ గెలిచేదే కాదన్నారు. 5 పరుగులకు బదులుగా.. 6 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ టైగా ముగిసిందని ఎరాస్మస్ చెప్పారు. ఫైనల్లో భారీ తప్పిదం చేశామని సహచర అంపైర్ కుమార్ ధర్మసేన […]
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!