Oppo A38 Price: ఒప్పో నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oppo A38 Smartphone Launch and Price: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ‘ఒప్పో’.. ఏ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ‘ఒప్పో ఏ38’ పేరుతో యూఏఈ, మలేషియా మార్కెట్‌లో రహస్యంగా రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత మార్కెట్‌లో కూడా అందుబాటులో ఉంటుందని సమాచారం. సరైన రిలీజ్ డేట్ ఇంకా తెలియరాలేదు. ఒప్పో ఏ38 ఫోన్ ఒకే కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరలో అనేక అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఆ వివరాలు ఓసారి చుద్దాం..
Oppo A38 Specs:
ఒప్పో ఏ38 స్మార్ట్‌ఫోన్ హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్‌తో 6.56 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. డిస్‌ప్లే 100 శాతం డీసీఐ-పీ3 మరియు sRGB కలర్‌లను కవర్ చేస్తుంది. ఇది మీకు గొప్ప అనుభూతిని అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇది 4GB RAM, 128GB స్టోరేజ్ కలిగి ఉండగా.. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 256GB వరకు విస్తరించవచ్చు.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
Oppo A38 Camera:
ఒప్పో ఏ38 స్మార్ట్‌ఫోన్ 50MP ప్రధాన కెమెరాను f/1.8 ఎపర్చర్‌తో కలిగి ఉంది. అద్భుత షాట్‌ల కోసం 2MP పోర్ట్రెయిట్ లెన్స్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5MP కెమెరా కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందుబాటులో ఉంది.
Also Read: iPhone 14 Price Drop: ఐఫోన్ 15 లాంచ్‌కు ముందు.. భారీగా తగ్గిన ఐఫోన్ 14 ధర! కేవలం రూ. 14 వేలకే
Oppo A38 Battery:
ఒప్పో ఏ38 ఫోన్ భారీ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 33W సూపర్ వూక్ ఛార్జింగ్‌తో ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ ఫోన్. 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS, USB-C పోర్ట్ మరియు హెడ్‌ఫోన్‌ల కోసం 3.5mm ఆడియో జాక్‌తో ఈ ఫోన్ వస్తుంది. సైడ్-ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉంది.
Oppo A38 Price:
ఒప్పో ఏ38 స్మార్ట్‌ఫోన్ మలేషియాలో 4GB RAM మరియు 128GB స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. దీని ధర దాదాపుగా రూ. 10,500గా ఉంటుంది. ఈ ఫోన్ గ్లోయింగ్ బ్లాక్ మరియు గ్లోయింగ్ గోల్డ్ కలర్ వేరియంట్‌లలో వస్తుంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!