Gautam Gambhir Names Yuvraj Singh As India Greatest-Ever Batter: ‘గౌతమ్ గంభీర్’.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. టీమిండియా ఓపెనర్‌గా ఓ వెలుగు వెలిగిన గౌతీ.. జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అంతేకాదు భారత్ గెలిచిన ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కూడా చేశాడు. టీ20 ప్రపంచకప్ 2007 ఫైనల్లో 75 రన్స్ చేసిన గంభీర్.. వన్డే ప్రపంచకప్ 2011లో 97 పరుగులు చేశాడు. మంచి బ్యాటర్‌గా పేరు సంపాదించిన గౌతీ.. బటయ మాత్రం దూకుడుగా ఉంటాడు. ‘ఎవడైతే నాకేంటి’ అనే ధోరణిలో ప్రవర్తిస్తుంటాడు. నిత్యం తనదైన శైలిలో మాట్లాడుతూ, విమర్శలు చేస్తూ వార్తల్లో ఉంటాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన రూటే సపరేట్ అన్నట్టు వ్యవహరించాడు.
వివేక్ బింద్రా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ది బడా భారత్’ అనే షోలో తాజాగా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పాల్గొన్నాడు. ర్యాపిడ్-ఫైర్ క్విజ్‌లో భాగంగా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. భారత క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్ ఎవరు అని అడిగి.. అందుకు ఆప్షన్స్‌గా సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ పేర్లను గౌతీకి వివేక్ బింద్రా ఇచ్చాడు. ఆప్షన్స్‌లో ఉన్న ముగ్గురిలో ఎవరినీ ఎంచుకోకుండా.. మాజీ హ్యాండ్ బ్యాటర్ యువరాజ్ సింగ్‌ను గంభీర్ ఎంచుకున్నాడు.
Also Read: ODI World Cup 2023: ప్రపంచకప్ 2023లో ఆడే నెదర్లాండ్స్ జట్టు ఇదే.. ఆంధ్ర అబ్బాయికి చోటు!
భారత బెస్ట్ కెప్టెన్ ఎవరు అని ప్రశ్నించిన వివేక్ బింద్రా.. గౌతమ్ గంభీర్‌కు కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ పేర్లను ఆప్షన్లుగా ఇచ్చాడు. ఈ ప్రశ్నకు గంభీర్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. మాజీ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే తన బెస్ట్ కెప్టెన్ అని పేర్కొన్నాడు. గంభీర్ సమాధానాలతో వివేక్ బింద్రా ఆశ్చర్యపోయాడు. అవుట్-ఆఫ్-ది బాక్స్ అభిప్రాయాలకు గౌతీ ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్ అనంతరం గంభీర్ తన చర్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.