Marnus Labuschagne as Concussion Sub for Cameron Green in SA vs AUS 1st ODI: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం బ్లూమ్‌ఫోంటైన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రొటీస్ కెప్టెన్ టెంబా బావుమా (114; 142 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు. మార్కో జాన్సెన్ (32) మినహా మిగతావారందరూ విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లో హాజిల్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా.. స్టోయినిస్ రెండు, సీన్ అబాట్, ఆస్టన్ అగర్, ఆడమ్ జంపా, కామెరూన్ గ్రీన్ తలా వికెట్ తీశారు.
223 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. డేవిడ్ వార్నర్ డకౌట్ కాగా.. మిచెల్ మార్ష్ (17) నిరాశపరిచాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్ తలకు కగిసో రబాడ వేసిన ఓ బౌన్సర్ బలంగా తాకింది. దాంతో రిటైర్డ్ హార్ట్‌గా పెవిలియన్ చేరాడు. ఆపై ఆసీస్ వరుసగా వికెట్స్ కోల్పోయింది. 74 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలో పడింది. ఈ సమయంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా మార్నస్ లూబుషేన్ (Marnus Labuschagne Concussion Sub) క్రీజులోకి వచ్చాడు.
Also Read: US Open Tennis 2023: ఒక ఆటగాడు చనిపోతాడు.. అప్పుడు కూడా వీళ్లు చూస్తూనే ఉంటారు!
కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మార్నస్ లూబుషేన్ (80 నాటౌట్; 93 బంతుల్లో 8 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వికెట్ల పతనాన్ని అడ్డుకోవడమే కాకుండా.. జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆస్టన్ అగర్ (48) అండతో ఆస్ట్రేలియాకు ఊహించని విజయాన్ని అందించాడు. ముందుగా తుది జట్టులో లబుషేన్‌కు చోటు దక్కలేదు. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఆడే అవకాశంను అందిపుచ్చుకున్న మార్నస్‌కు ‘మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్’ అవార్డు లభించింది. గతంలో కూడా లూబుషేన్ కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు. ఓ టెస్ట్ మ్యాచులో స్టీవ్ స్మిత్ తలకు గాయం కాగా.. లూబుషేన్ బరిలోకి దిగాడు. లూబుషేన్ కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగడం ఇది రెండోసారి.
Marnus Labuschagne will be the first concussion substitute legend in cricket. pic.twitter.com/9EvVbMVMVZ
— Johns. (@CricCrazyJohns) September 7, 2023