బెట్టింగ్ యాప్స్ ఉసురు తీస్తున్నాయి. వీటి మాయలో పడ్డ యువత.. నిండా మునిగి.. అప్పులపాలై ఎవరికి వారే ఉసురు తీసుకుంటున్నారు. మరికొందరు డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. చివరికి సొంత వాళ్లను కూడా చంపేందుకు వెనకాడడం లేదు. అలాంటి ఘటనే యూపీలో జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసగా మారిన కొడుకు.. డబ్బు కోసం కన్నతల్లినే కడతేర్చాడు. మరో వ్యక్తి ఓయో రూమ్‌లో సూసైడ్ చేసుకున్నాడు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న యువతీ యువకులు ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లకు […]
‘దీపావళి’ పండుగ హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ దీపాల పండుగ కోసం దేశంలోని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి దీపావళి పండగ తేదీ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. కొంతమంది జ్యోతిష్కులు దీపావళి పండగను అక్టోబర్ 20న వస్తుందని చెబుతుండగా.. మరికొందరు అక్టోబర్ 21న జరుపుకుంటారని అంటున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి పండగను ఏ రోజున జరుపుకోవాలో మనం తెలుసుకుందాం. దేశంలోని ప్రముఖ పండితుల సంస్థ ‘కాశీ విద్వత్ […]
వన్డే, టీ20 సిరీస్‌ల కోసం త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ వెళ్లనుంది. అక్టోబర్ 19 నుంచి వన్డే సిరీస్, అక్టోబర్ 29 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్నాయి. వన్డే సిరీస్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడనున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత రోహిత్ ఆడనున్న సిరీస్ ఇదే. దాదాపు 7 నెలల తర్వాత హిట్‌మ్యాన్ జట్టులోకి వచ్చాడు. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు బీసీసీఐ వన్డే పగ్గాలు అప్పగించడంతో.. రోహిత్ ఆటగాడిగా మాత్రమే […]
ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ దుమ్మురేపాడు. కెరీర్లో అత్యుత్తమ టెస్టు రేటింగ్ పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకిన సిరాజ్.. 12వ స్థానానికి చేరుకున్నాడు. హైదరబాదీ పేసర్ ఖాతాలో ప్రస్తుతం 718 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఏడు వికెట్లు పడగొట్టడంతో సిరాజ్ దూసుకొచ్చాడు. అక్టోబర్ 10 నుంచి న్యూఢిల్లీలో ఆరంభం కానున్న రెండో టెస్టులో […]
భారత క్రికెట్లో చాలా మంది ఆటగాళ్లు తమ కెప్టెన్సీలో టీమిండియాను మరో స్థాయికి తీసుకెళ్లారు. సునీల్ గవాస్కర్ మొదలు మహమ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలు తమ కెప్టెన్సీలో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ టెస్ట్ మ్యాచ్‌లను అందించారు. కానీ అత్యధిక టెస్టుల్లో భారతదేశానికి ఏ ఆటగాడు నాయకత్వం వహించాడో మీకు తెలుసా?. టాప్ ఐదుగురు భారత కెప్టెన్ల లిస్టును ఓసారి పరిశీలిద్దాం. విరాట్ కోహ్లీ: భారత టెస్ట్ క్రికెట్లో కెప్టెన్సీ విషయానికి […]
భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ అక్టోబర్ 10 నుంచి న్యూఢిల్లీలో ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను భారత్ చిత్తుగా ఓడించింది. ఈ ఓటమి తర్వాత వెస్టిండీస్ హెడ్ కోచ్, విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ తాను విమర్శలకు సిద్ధంగా ఉన్నానని ఒప్పుకున్నాడు. ఒకప్పుడు ఆధిపత్యం చెలాయించిన కరేబియన్ టెస్ట్ జట్టు పతనానికి ఇటీవలి తన నిర్ణయాలు కాదని, దశాబ్దాల నాటి లోపాలే అని స్పష్టం చేశాడు. ఢిల్లీలో భారత్‌తో జరిగే రెండో టెస్టుకు […]
టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ సంజు శాంసన్ మంగళవారం ముంబైలో జరిగిన 2025 సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్‌లో పాల్గొన్నాడు. టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సంజు అందుకున్నాడు. ఈ సందర్భంగా తన కెరీర్‌లోని సవాళ్లను, గాయాలను, జట్టుకు దూరంగా ఉన్నప్పుడు పడిన భాధను పంచుకున్నాడు. సంజు చేసిన సంవత్సరాల పోరాటం.. దేశం పట్ల అతడికి ఉన్న అపారమైన అంకితభావంకు నిదర్శనం. తన 10 ఏళ్ల కెరీర్లో కేవలం 40 మ్యాచ్‌లు మాత్రమే ఆడానని […]
మంగళవారం ముంబైలో జరిగిన 27వ ఎడిషన్ సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డుల వేడుకలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇందుకు కారణం.. ఎవరూ ఊహించని రీతిలో హిట్‌మ్యాన్ బరువు తగ్గడమే. వన్డే ప్రపంచకప్ 2027లో ఆడడంను లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్.. ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో 95 కేజీల నుంచి 75 కిలోలకు బరువు తగ్గాడు. 20 కేజీల బరువు తగ్గిన హిట్‌మ్యాన్.. ఇప్పుడు యువ క్రికెటర్లకే పోటీనిచ్చేలా ఉన్నాడు. […]
ఇటీవలి కాలంలో టీమిండియా ఆటగాడు పృథ్వీ షా పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినబడుతోంది. నెట్టింట వార్తల్లో నిలిచేది ఆటతో మాత్రం కాదు. తన ఫిట్నెస్, డేటింగ్, వివాదాస్పద ప్రవర్తన కారణంగా పృథ్వీ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు. బీసీసీఐ సహా ముంబై జట్టు అతడిపై చర్యలు తీసుకున్నా.. మారడం లేదు. దురుసు ప్రవర్తనను అలానే కొనసాగిస్తున్నాడు. తాజాగా మాజీ సహచరుడి పైనే బ్యాట్ ఎత్తాడు. అక్కడితో ఆగకుండా కాలర్ పట్టుకోవడం, దుర్భాషలాడటం కూడా చేశాడు. ఇందుకు సంబంధించిన […]
ఆస్ట్రేలియా స్టార్స్ పాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్లకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఓ ఐపీఎల్ ప్రాంచైజీ ఇద్దరికీ 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ.58.2 కోట్లు) చొప్పున ఆఫర్ చేసింది. ఏడాది పొడవునా తమ ఫ్రాంచైజీకి చెందిన జట్ల తరఫున టీ20 లీగుల్లో ఆడాలని తెలిపింది. అయితే ఈ భారీ మొత్తం అందుకోవాలంటే.. ఓ కండిషన్ పెట్టింది. కమ్మిన్స్, హెడ్లు ముందుగా ఆస్ట్రేలియా క్రికెట్ నుంచి బయటకు రావాలని షరతు పెట్టింది. ఈ న్యూస్ ప్రస్తుతం […]