Prithvi Shaw: బ్యాట్ ఎత్తడం, కాలర్ పట్టుకోవడం, దుర్భాషలాడటం.. పృథ్వీ షా ఇక మారాడా?
- సోషల్ మీడియాలో పృథ్వీ షా పేరు వైరల్
- ఆగ్రహంతో ఊగిపోయిన పృథ్వీ
- తృటిలో ప్రమాదంను తప్పించుకున్న ముషీర్ ఖాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలి కాలంలో టీమిండియా ఆటగాడు పృథ్వీ షా పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినబడుతోంది. నెట్టింట వార్తల్లో నిలిచేది ఆటతో మాత్రం కాదు. తన ఫిట్‌నెస్, డేటింగ్, వివాదాస్పద ప్రవర్తన కారణంగా పృథ్వీ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు. బీసీసీఐ సహా ముంబై జట్టు అతడిపై చర్యలు తీసుకున్నా.. మారడం లేదు. దురుసు ప్రవర్తనను అలానే కొనసాగిస్తున్నాడు. తాజాగా మాజీ సహచరుడి పైనే బ్యాట్ ఎత్తాడు. అక్కడితో ఆగకుండా కాలర్ పట్టుకోవడం, దుర్భాషలాడటం కూడా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ముంబై, మహారాష్ట్రల మధ్య మూడు రోజుల మ్యాచ్ జరుగుతోంది. మహారాష్ట్ర తరఫున బరిలోకి దిగిన పృథ్వీ షా భారీ సెంచరీ (181) చేశాడు. పృథ్వీ బ్యాటింగ్ చూస్తే.. డబుల్ సెంచరీ పక్కా అని అందరూ అనుకున్నారు. ముంబై ఆల్‌రౌండర్ ముషీర్ ఖాన్ వేసిన బంతిని భారీ షాట్‌కు యత్నించిన పృథ్వీ.. లాంగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. పృథ్వీ డబుల్ సెంచరీ మిస్ అవ్వడంతో.. ముషీర్ సంతోషంలో ‘థాంక్యూ’ అని అన్నాడు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన పృథ్వీ.. తన బ్యాట్‌ను ముషీర్ వేగంగా వైపు తిప్పాడు. ముషీర్ తృటిలో ఆ ప్రమాదంను తప్పించుకున్నాడు.
Also Read
Also Read: Pat Cummins-IPL: కమిన్స్‌కు రూ.58 కోట్లు ఆఫర్ చేసిన ఐపీఎల్ ప్రాంచైజీ.. కానీ ఓ కండిషన్!
పృథ్వీ షా అక్కడితో ఆగలేదు. మరింత వేగంగా ముషీర్ ఖాన్ వైపు వెళ్లి అతడి కాలర్ పట్టుకున్నాడు. ఆ తర్వాత దుర్భాషలాడాడు. అంపైర్లు, ముంబై ప్లేయర్స్ కలగజేసుకోవడంతో పృథ్వీ వెనక్కి తగ్గాడు. ఈ గొడవకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పృథ్వీ షా దురుసు ప్రవర్తనపై అందరూ మండిపడుతున్నారు. ‘పృథ్వీ షా ఇక మారాడా?’, ‘ఇలా అయితే భారత జట్టులోకి పృథ్వీ షా రావడం కష్టమే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పృథ్వీ కెరీర్‌లో ఇలాంటివి వివాదాలు ఎన్నో ఉన్నాయి. మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ సప్నా గిల్‌తో వివాదం, డోపింగ్ టెస్టులో విఫలం, డీసీ కోచ్ రికీ పాంటింగ్‌పై విమర్శలు.. ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి.
🚨 PRITHVI SHAW vs MUSHEER KHAN 🚨
– Heated exchange between Prithvi Shaw and Musheer Khan after Prithvi's wicket 😮
– Prithvi Shaw allegedly tried to raise his bat and grab the collar of Musheer Khan 😨
– What's your take 🤔 pic.twitter.com/FD44yWYwpJ
— Richard Kettleborough (@RichKettle07) October 8, 2025
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు