శాసనమండలి ప్రతిపక్ష నేత, వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త బొత్స సత్యనారాయణ కుటుంబానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. బొత్స కుటుంబం విజయనగరంలో శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం చూస్తుండగా వేదిక కూలింది. బొత్స కుటుంబంకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయగా.. సిరిమానోత్సవం ప్రారంభమైన కాసేపటికే వేదిక ఒక్కసారిగా కూలింది. ఈ ఘటనలో బొత్స కుటుంబ సభ్యులకు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సిరిమానోత్సవ తిలకానికి ప్రత్యేకంగా అర్భన్ బ్యాంక్ ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన వేదిక అకస్మాత్తుగా […]
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనపై ఉత్కంఠకు తెరలేపింది. రోడ్డు మార్గం ద్వారా మెడికల్ కాలేజ్ పరిశీలనకు వెళ్లేందుకు అనుమతి లభించలేదు. తమిళనాడు కరూర్‌లో తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో రోడ్డు మార్గం ద్వారా జగన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ప్రకటించారు. జగన్ టూర్ కోసం భారీ జన సమీకరణ జరుగుతున్నందున 63 కిమీ రోడ్డు మార్గం ద్వారా వెళ్లేందుకు అవసరమైన భద్రత […]
‘ప్రేమ వివాహం’ మరో యువకుడి ప్రాణాలను బలిగొంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు యువకుడిపై యువతి సోదరుడు కత్తులతో దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా పొన్నూరు రోడ్లో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న లాలాపేట పోలీసులు.. మృతదేహంను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువతి సోదరుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… Also Read: Heavy Rains Today: రానున్న మూడు గంటల్లో భారీ వర్షాలు.. […]
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. రానున్న మూడు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అంతేకాదు పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్ల క్రింద ఉండకూడని, ఇంట్లోనే సురక్షితంగా ఉండండని ప్రజలకు సూచించారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ […]
అక్టోబరు 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తాను అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. అక్టోబరు 10 నుంచి నవంబర్ 22వరకూ రచ్చబండ కార్యక్రమం ఉంటుందని, మెడికల్ కాలేజీల ప్రైవటీకరణపై కరపత్రాలు పంపిణీ చేస్తామని చెప్పారు. కోటి సంతకాలను రచ్చబండ కార్యక్రమాల ద్వారా సేకరిస్తామని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కనీసం ప్రతి పంచాయతీ నుంచి 500 మందితో సంతకాలు సేకరిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గ సమన్వయ కర్త ప్రతిరోజూ రెండు గ్రామాలను సందర్శిస్తాడని, […]
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పాలన మీద ధ్యాస లేదని, సొంత ఆదాయాలు పెంచుకోవడం మీదే పూర్తి ధ్యాస పెట్టారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయాలు తగ్గుతున్నాయన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు, ఆయన బినామీల జేబుల్లోకి ఆదాయాలు వెళ్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో దోచుకో.. పంచుకో.. తినుకో అనేదే కనిపిస్తోందని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజినల్ కో-ఆర్డినేటర్లు, […]
తప్పతాగి రోడ్డెక్కడం.. రయ్య్‌మని దూసుకెళ్తూ అమాయకుల ప్రాణాలు బలితీసుకోవడం మందుబాబులకు అలవాటుగా మారింది. డ్రంక్ అండ్ డ్రైవ్.. ఓవర్ స్పీడ్.. ర్యాష్ డ్రైవింగ్‌లకు పోలీసులు అడుగడుగునా చెక్పెడుతున్నా మందుబాబులు మాత్రం రెచ్చిపోతున్నారు. పట్టపగలే పీకలదాకా తాగి ర్యాష్ డ్రైవింగ్‌తో యాక్సిడెంట్లకు పాల్పడుతున్నారు. నార్సింగ్‌లో తాజాగా జరిగిన ప్రమాదమే ఇందుకు నిదర్శనం. పట్టపగలే మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన ప్రమాదంలో ఓ మహిళ కొనప్రాణాలతో కొట్టిమిట్టాడుతోంది. నార్సింగ్ పరిధిలో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం […]
కట్టుకున్న భర్తే.. ఆమె పాలిట కాల యముడయ్యాడు. నిత్యం అనుమానిస్తుండడంతో దూరంగా ఉంటున్న ఆమెను నమ్మించి అత్యంత దారుణంగా కడతేర్చాడు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో కలకలం సృష్టించింది. భార్య కాపురానికి రాలేదన్న కారణంతో భర్త.. ఆమెను ఇటుకలతో కొట్టి చంపేశాడు. ఇక్కడ చూడండి.. విగత జీవిగా పడి ఉన్న ఈమె పేరు లక్ష్మీ పార్వతి. ఆమె స్వస్థలం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం కృష్ణాపురం. ఈమెకు చింతకుంటకు చెందిన నల్లగట్ల శేషగిరితో వివాహమైంది. వారిద్దరికీ నలుగురు […]
తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ‘మార్వాడి గో బ్యాక్’ జేఏసీ రాష్ట్ర కమిటీ ఏర్పడింది. మార్వాడి గో బ్యాక్ జేఏసీ చైర్మన్‌గా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఎన్నికయ్యారు. పిడమర్తి రవిని 11 సంఘాల నాయకులు కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ… మార్వాడీలకు హెచ్చరికలు జారీ చేశారు. కొత్తగా షాపులు ఏర్పాటు చేస్తే భౌతిక దాడులే అని […]
హైదరాబాద్ నగరం రాయదుర్గంలోని భూమికి ఆల్ టైమ్ రికార్డు ధర దక్కింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరం ధర ఏకంగా రూ.177 కోట్లు పలికింది. రాయదుర్గం ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని టీజీఐఐసీ, జేఎల్ఎల్ ఇండియా అండ్ ఎంఎస్టీసీ భాగస్వామిగా వేలం నిర్వహించారు. రాయదుర్గంలోని 7.67 ఎకరాలకు వేలం నిర్వహించగా.. మొత్తం రూ.1357.59 కోట్లు ప్రభుత్వంకు దక్కింది. వేలంలో పాల్గొన్న ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ అత్యధిక ధరతో 7.6 ఎకరాల భూమిని సొంతం చేసుకుంది. వేలంలో ఇది […]