ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. రెండు పరీక్షల తేదీలను ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు మార్చింది. సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్-2ఏ, సివిక్స్ పేపర్-2.. ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1 పరీక్షల తేదీలు మారాయి. మార్చి 3న జరగాల్సిన ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ పేపర్- 2ఏ, సివిక్స్ పేపర్ -2 ఎగ్జామ్స్.. మార్చి 4న జరగనున్నాయి. అలానే మార్చి 20న జరగాల్సిన ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1 పరీక్షలు మార్చి 21న జరగనున్నాయి. మిగతా పరీక్షలు అన్ని షెడ్యూల్ ప్రకారం యథాతథంగా జరుగుతాయి.
ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు.. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23 వరకు సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. హోలీ, రంజాన్ పండుగల నేపథ్యంలో ఇంటర్ పరీక్షల తేదీలలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మార్చి 3న హోలీ, 20న రంజాన్ ఉండటంతో.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసి కొత్త టైం టేబుల్‌ని అధికారులు విడుదల చేశారు.
ఫస్టియర్ షెడ్యూల్:
ఫిబ్రవరి 23 – ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
ఫిబ్రవరి 25 – ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ 1
ఫిబ్రవరి 27 – ఫస్ట్ ఇయర్ హిస్టరీ పేపర్ 1, బోటనీ పేపర్ 1
మార్చి 2 – ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 1, పేపర్ 1ఏ
మార్చి 5 – ఫస్ట్ ఇయర్ జూవాలజీ/ మ్యాథ్స్ 1బి, జూవాలజీ పేపర్ 1
మార్చి 7 – ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ 1,
మార్చి 10- ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ 1
మార్చి 12 – ఫస్ట్ ఇయర్ కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 1
మార్చి 14- ఫస్ట్ ఇయర్ సివిక్స్ 1
మార్చి 17 – ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ 1
మార్చి 21 – ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 1
మార్చి 24 – ఫస్ట్ ఇయర్ మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రఫీ 1
సెకండ్ ఇయర్ షెడ్యూల్:
ఫిబ్రవరి 24 – సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
ఫిబ్రవరి 26 – ఇంగ్లీషు పేపర్ 2
ఫిబ్రవరి 28 – సెకండ్ ఇయర్ హిస్టరీ/ బోటనీ పేపర్ 2
మార్చి 4 – సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 2ఏ/ సివిక్స్ 2
మార్చి 6 – సెకండ్ ఇయర్ జూవాలజీ 2/ ఎకనామిక్స్ 2
మార్చి 9- సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 2బి
మార్చి 11- సెకండ్ ఇయర్ ఫిజిక్స్/ కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 2
మార్చి 13- సెకండ్ ఇయర్ ఫిజిక్స్ 2
మార్చి 16 – సెకండ్ ఇయర్ మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రఫీ 2
మార్చి 18 – సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ 2
మార్చి 23 – సెకండ్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ -2