ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ రిచా ఘోష్ అద్భుత బ్యాటింగ్‌తో అలరించింది. గురువారం విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో రిచా 77 బంతుల్లో 11 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 94 పరుగులు చేసింది. రిచా చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో భారత జట్టు 251 పరుగులు చేసింది. 102/6తో పీకల్లోతు ఇబ్బందుల్లో ఉన్న జట్టును రిచా ఒంటిచేత్తో ఆడుకుంది. ఓ దశలో భారత్ 150 పరుగులైనా చేస్తుందా అని […]
ఓ వైపు కొడుకు అనారోగ్యం.. మరోవైపు కుటుంబాన్ని పట్టించుకోని భర్త.. పైగా ఆర్ధికంగా రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. పెద్ద కొడుకుపై దొంగతనం ముద్ర పడడంతో మానసికంగా మరింత కుంగిపోయింది. ఆ తల్లి అలసిపోయి.. ఇక బతకలేనని నిర్ణయించుకుంది. పుట్టెడు దుఃఖంతో చిన్న కొడుకు కళ్లెదుటే బలవన్మరణం చెందింది. ఈ ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్లో విషాదం నింపింది. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న వారి పేర్లు నరసింహ, సుధ. వీరి స్వస్థలం ప్రకాశం జిల్లా కందుకూరు. సుధ, […]
హైదరాబాద్‌లో పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. డ్రగ్ స్మగ్లర్లు తమ దందా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లూ ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చి.. ఇక్కడ వినియోగదారులకు సరఫరా చేసేవాళ్లు. కానీ ఇప్పుడు స్మగ్లర్లు పంథా మార్చారు. ఏకంగా హైదరాబాద్‌లోనే డ్రగ్స్ తయారీ మొదలు పెట్టారు. మొన్నటికి మొన్న ఉప్పల్ ప్రాంతంలో డ్రగ్స్ తయారీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా మరోసారి భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. హైదరాబాద్‌లో […]
ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లా ఇటియాథోక్లోని భిఖంపూర్వా బ్లాక్‌కు చెందిన 6 ఏళ్ల బాలిక అనామిక మిశ్రా అథ్లెట్లు కూడా కష్టంగా భావించే అరుదైన ఘనతను సాధించింది. అనామిక ఆరేళ్ల వయసులో ఒక గంటలో 10 కిలోమీటర్ల పరుగును ఆగకుండా పూర్తి చేసింది. అంతేకాదు ఎనిమిది నిమిషాల్లో 240 పుషప్స్ పూర్తి చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. యోగా, పరుగు, వెయిట్ లిఫ్టింగ్ ద్వారా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన అనామిక.. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో బంగారు పతకం […]
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచులో భారత్ బ్యాటింగ్ ముగిసింది. 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయింది. కష్టాల్లో పడిన జట్టును రిచా ఘోష్ (94; 77 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆడుకుంది. అయితే తృటిలో సెంచరీ మిస్ చేసుకుంది. ఇన్నింగ్స్ చివరలో స్నేహ్ రాణా (33) ధాటిగా ఆడింది. ఓపెనర్లు ప్రతీకా రావల్ (37), స్మృతి మంధాన (23)లు మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. […]
కార్తీక కృష్ణ చతుర్థి నాడు మహిళలు ‘కర్వా చౌత్’ ఉపవాసం పాటిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 10న కర్వా చౌత్ వస్తోంది. దాంతో ఉత్తర భారతదేశంలో పండుగ శోభ ఉట్టిపడుతోంది. మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం చేసే ఈ పండుగను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఉత్తర భారతదేశంలో మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. వివాహిత మహిళలు రాత్రి చంద్రుడి పూజ అనంతరం ఉపవాసం విరమిస్తారు. […]
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా విశాఖ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తక్కువ స్కోరుకే అవుట్ అయింది. 32 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ సాయంతో 23 రన్స్ మాత్రమే చేసింది. నోన్కులులేకో మ్లాబా బౌలింగ్‌లో సునే లూస్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన చేసింది 23 […]
కాంగ్రెస్ మాజీ ఎంపీ, కన్నడ నటి రమ్యకు అశ్లీల సందేశాలు పంపిన కేసులో కర్ణాటక పోలీసులు ఈరోజు 12 మందిపై చార్జిషీట్ దాఖలు చేశారు. 380 పేజీల చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేసి.. 12 మందిని నిందితులుగా చేర్చారు. బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారులు 45వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు 380 పేజీల నివేదికను సమర్పించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా కన్నడ సూపర్‌స్టార్ దర్శన్, అతని స్నేహితురాలు పవిత్ర గౌడ […]
టీమిండియా సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు దిగ్గజాలు వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో రోహిత్, కోహ్లీల భవితవ్యంపై చర్చలు జరిగాయి. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఇద్దరు చోటు దక్కించుకున్నా.. ఇంకా రెండేళ్ల సమయం ఉన్న 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడడం అనుమానమే అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలకు […]
టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్‌కు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఠా నుంచి బెదిరింపులు వచ్చాయి. రింకూను దావూద్ ఇబ్రహీం డి-కంపెనీ రూ.10 కోట్లు డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించినట్లు ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. రింకూను బెదిరించిన నిందితులను పోలీసులు విచారించగా.. ఈ విషయం బయటపడింది. మొహమ్మద్ దిల్షాద్, మొహమ్మద్ నవీద్ అనే ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. 2025 ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య […]