భారతదేశ ఆరోగ్య సంరక్షణ పరివర్తనను రూపొందించడంలో ఫిక్కీ హెల్త్ సర్వీసెస్ కమిటీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అందుబాటులో వైద్యం, ఖర్చు నియంత్రణ నుంచి భవిష్యత్తు సిద్ధత మరియు నమ్మకమే భారత ఆరోగ్య విజన్ 2047 అని ఫిక్కీ హీల్ 2025లో వరుణ్ ఖన్నా అన్నారు. ఇండియన్ వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ) ఆధ్వర్యంలో నిర్వహించే వార్షిక ఆరోగ్య సదస్సు ఫిక్కీ హీల్ 2025 నేడు న్యూఢిల్లీలోని ఫెడరేషన్ హౌస్‌లో ప్రారంభమైంది. ఈసారి ఫిక్కీ హెల్త్ సర్వీసెస్ […]
తెలంగాణ తెలుగుదేశం నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమావేశం అయ్యారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలతో ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు సమావేశం అయ్యారు. సుదీర్ఘ కాలం తరువాత చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతలు సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుని ఎంపిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. ఇప్పటికే కసరత్తు పూర్తియిన నేపథ్యంలో తెలంగాణలో మండల అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని సమావేశంలో […]
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో షాకింగ్ ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. అందులో కొన్ని ఘటనలు ఒళ్లు గగుర్పొడిచే రీతిలో ఉంటే.. మరికొన్ని హృదయ విదారకంగా ఉంటాయి. మరికొన్ని అయితే నమ్మలేని రీతిలో ఉంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే తాజాగా చోటుచేసుకుంది. ఓ వ్యక్తి లారీ కింద పడ్డా ఏమీ కాలేదు. ఈ వీడియో చూస్తే.. పెద్దలు చెప్పిన ఓ మాట తప్పక గుర్తొస్తోంది. ‘వీడికి ఇంకా భూమ్మీద నూకలు ఉన్నాయిరో’. ఇక వివరాల్లోకి వెళితే… […]
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో మరోసారి విచారణకు హాజరుకావాలంటూ పిన్నెల్లి సోదరులకు మాచర్ల రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు రావాలని నోటీసులలో పేర్కొన్నారు. మూడు నెలల క్రితం గుండ్లపాడులో టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్య కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిలపై వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. Also Read: 2027 World Cup: రోహిత్, కోహ్లీలు […]
2027 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆడడం డౌటే అని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. మెగా టోర్నీకి చాలా సమయం ఉందని.. అప్పటివరకు ఇద్దరు తమ ఫామ్, ఫిట్నెస్ను ఎలా కాపాడుకుంటారో చూడాలన్నాడు. శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ ఇవ్వడంతో కోహ్లీ, రోహిత్‌లను జట్టు నుంచి పక్కన పెట్టేసినట్లు పరోక్షంగా సంకేతాలు ఇవ్వడమే అని ఏబీడీ పేర్కొన్నాడు. అక్టోబర్ 19న ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆరంభం […]
స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆహ్వానం మేరకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నర్సీపట్నం వెళ్తున్నారు అని.. పోలీసులు ఇప్పుడు అనుమతి లేదు అంటే స్పీకర్ అంటే గౌరవం లేదా? అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. స్పీకర్‌కి మెడికల్ కాలేజీ కనిపించడం లేదని, జగన్ వెళ్లి చూపిస్తారని విమర్శించారు. మెడికల్ కాలేజీకి సంబంధించిన జీవోను, నిర్మాణాలను, పనులు ఆపివేయాలని ప్రభుత్వం ఇచ్చిన జీవో కూడా చూపిస్తామని తెలిపారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తప్పు […]
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి 2025 దసరా ఉత్సవాలు ముగిసిన విషయం తెలిసిందే. తాజాగా నిర్వహించిన హుండీ లెక్కింపులో రికార్డు స్థాయిలో ఆదాయం నమోదైంది. దసరా నవరాత్రుల 11 రోజుల హుండీ లెక్కింపు పూర్తవగా.. ఈసారి అమ్మవారి హుండీ ఆదాయం 10.30 కోట్లను దాటింది. గత సంవత్సరం 2024 దసరా నవరాత్రులలో 9.32 కోట్లు వస్తే.. ఈసారి దాదాపు ఒక కోటి రూపాయల పెరుగుదల నమోదైంది. Aslo Read: Jubilee Hills By-Poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ […]
ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ టీడీపీ నేతలతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. కూటమి అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని సీఎం నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ స్థానిక ఎన్నికలపైనా సీఎం చంద్రబాబు నేతలతో చర్చించినట్లు సమాచారం. ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా టీడీపీ కూడా దూకుడు పెంచింది. Also Read: Vizag CP: అందుకే.. వైఎస్ జగన్ […]
విశాఖలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు అనుమతి లేదని విశాఖపట్నం సీపీ శంఖబ్రత బాగ్చి చెప్పారు. జగన్ పర్యటన రోజే విశాఖలో మహిళల ప్రపంచకప్ 2025 మ్యాచ్ ఉందని, ఆ మ్యాచ్‌కు ఫాన్స్ భారీగా హాజరయ్యే అవకాశమున్నందున పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. వైసీపీ శ్రేణులు ర్యాలీగా వెళ్తే జాతీయ రహదారి బ్లాక్ అవుతుందని, రోడ్ బ్లాక్ అయితే తమిళనాడులో దళపతి విజయ్ ర్యాలీలో జరిగినట్టు తొక్కిసలాట జరగవచ్చన్నారు. ఆ […]
ఉప్పాడ తీర ప్రాంతంలో మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కంపెనీల నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల మత్య్స సంపద దొరకడం లేదని, దానిపై ఒక నిర్ణయం తీసుకోవాలని గత నెల 23, 24 తేదీలలో మత్స్యకారులు భారీ ఆందోళన నిర్వహించారు. అక్టోబర్ 10లోపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి సమస్యకు పరిష్కారం చూపాలని డెడ్ లైన్ పెట్టారు. అప్పటివరకు వేటకు వెళ్ళమని మత్స్యకారులు క్లారిటీ ఇచ్చారు. […]