Sampath Kumar
Author- NTV Telugu-
Prajapalana Program: గ్రామ సదస్సులకు ‘ప్రజాపాలన’గా పేరు.. డిసెంబర్ 28 నుంచి షురూ!
గ్రామ సదస్సులకు ‘ప్రజాపాలన’గా పేరు మార్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టాలన్నారు. Also Read: India […] -
India Women: మరో సంచలనం సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు!
India defeated Australia for the first time in Women’s Test History: ఇంగ్లండ్‌పై చారిత్రక టెస్ట్ విజయంతో ఫుల్‌జోష్‌లో ఉన్న భారత మహిళల జట్టు.. మరో సంచలనం నెలకొల్పింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శనతో మరోరోజు ఆట మిగిలి ఉండగానే జయకేతనం ఎగురవేసింది. భారత మహిళలకు ఆస్ట్రేలియా జట్టుపై మొట్టమొదటి టెస్టు గెలుపు ఇదే కావడం విశేషం. […] -
KTR: ‘శ్వేతపత్రం’ తప్పుల తడక.. కాంగ్రెస్ ప్రభుత్వం మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది: కేటీఆర్
KTR Presentation On BRS Govt 9.6 Years Rule: ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ‘శ్వేతపత్రం’ తప్పుల తడక అని, అబద్ధాల పుట్ట అని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్దేశ పూర్వకంగానే బీఆర్ఎస్ పాలనను బద్నాం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రక్తాన్ని రంగరించి రాష్ట్రాన్ని ప్రగతి పధం వైపు నడిపించామని, విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్లిన ఘనత తమ పార్టీది అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన ఆరోపణలు, […] -
Sabarimala Darshan 2023: శబరిమలకు పోటెత్తిన భక్తులు.. ఎరుమేలిలో భారీగా ట్రాఫిక్ జామ్!
Pilgrims Wait For Hours At Sabarimala Due To Heavy Rush: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం శబరిమల భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. కొండ మొత్తం అయ్యప్ప స్వామి నామస్మరణతో మార్మోగిపోతోంది. అయ్యప్ప స్వామిని దర్శించుకోవటానికి వస్తున్న భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఓ వైపు వర్షాలు, చలి పెడుతున్నా.. అయ్యప్ప భక్తులు మాత్రం స్వామిని దర్శనం చేసుకోవటానికి వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం కేరళలో భక్తుల తాకిడి విపరీతంగా […] -
IIT Kanpur Professor: పూర్వ విద్యార్థుల సమావేశంలో ప్రసంగిస్తూ.. కన్నుమూసిన ఐఐటీ ప్రొఫెసర్!
IIT Kanpur Professor died after suffering a cardiac arrest: ఐఐటీ కాన్పూర్‌లో విషాదకర ఘటన చోటు చేసుకొంది. సీనియర్ ప్రొఫెసర్ సమీర్ ఖండేకర్ (53) యూనివర్సిటీలో ప్రసంగిస్తూ గుండెపోటుతో మరణించారు. ఆడిటోరియంలో జరిగిన పూర్వ విద్యార్థుల సమావేశంలో ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ సమీర్.. గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకోగా.. ఐఐటీ కాన్పూర్ అధికారులు శనివారం వెల్లడించారు. ‘మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి’ అని విద్యార్థులకు ఆయన చివరి […] -
Cold Intensity: తెలంగాణలో చలి పంజా.. సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు!
Night temperatures Falling Down in Telangana: తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ఈశాన్యం నుంచి గాలులు వీస్తుండటంతో.. గత పది రోజులుగా రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. శనివారం రాత్రి పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలలో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిర్పూర్లో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు సొనాలలో 8.5 ఉష్ణోగ్రతలు నమోదు. బేల 9.2, బజార్ హత్నూర్‌లో 9.3, పొచ్చెరలో 9.5, […] -
MMTS Trains Cancelled: హైదరాబాద్ ప్రయాణికులకు అలెర్ట్.. 29 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు!
29 MMTS Trains Cancelled in Hyderabad: హైదరాబాద్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో పలు మార్గాల్లో నడువనున్న 29 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. పలు ఆపరేషనల్ కారణాలతో ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. ప్రయాణికులు తమకు సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. సికింద్రాబాద్, లింగంపల్లి, ఉందానగర్, ఫలక్‌నుమా మార్గాల్లో నడిచే రైళ్లు రద్దు అయ్యాయి. లింగంపల్లి-ఉందానగర్ (47213), ఉందానగర్-లింగంపల్లి (47211), ఉందానగర్-సికింద్రాబాద్ (47246), […] -
Coronavirus Cases: కరోనా వైరస్ విజృంభణ.. ఒక్కరోజే 104 కొత్త కేసులు నమోదు!
Karnataka Logs 104 New Coronavirus Cases: భారత దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగిపోతున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో గత 24 గంటల్లో 104 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 271కి చేరుకుంది. కర్ణాటకలో డిసెంబరు 15 నుంచి నాలుగు కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో పాజిటివిటీ రేటు 5.93%గా ఉంది. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు […] -
Jayashankar Bhupalpally Collector: అటెండర్‌తో బూట్లు మోయించిన కలెక్టర్.. ఫోటోలు వైరల్!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అటెండర్‌తో బూట్లు మోయించారనే ఆరోపణలు కలెక్టర్ భవేశ్ మిశ్రా ఎదుర్కొంటున్నారు. క్రిస్మస్ 2023 సందర్భంగా స్థానిక చర్చిలో జరిగిన వేడుకలకు కలెక్టర్ భవేశ్ మిశ్రా బూట్లతోనే ప్రార్థన మందిరంలోకి వెళ్లారు. బూట్లతో ప్రార్థన మందిరంలోకి వెళ్లడం సరికాదని గ్రహించిన కలెక్టర్.. పక్కనే ఉన్న అటెండర్ దఫేదార్ చేతికి తన బూట్లను ఇచ్చారు. Also Read: Mulugu Bokka: మూలుగ బొక్క కోసం లొల్లి.. […] -
Mulugu Bokka: మూలుగ బొక్క కోసం లొల్లి.. పెళ్లి సంబంధం రద్దు! అచ్చం బలగం సినిమా మాదిరే
Marriage was Cancelled for Mooluga Bokka in Telangana: ‘బలగం’ సినిమాలో మూలుగ బొక్క కోసం బావ బామ్మర్దుల మధ్య జరిగే గొడవ అందరికీ గుర్తుండే ఉంటుంది. పెళ్లి అనంతరం పండగకు అత్తారింటికి వచ్చిన అల్లుడికి మూలుగ బొక్క వేయకపోవడంతో బావ, బామ్మర్దుల మధ్య జరిగిన గొడవ.. ఆ కుటుంబంలో కలహాలకు దారి తీస్తుంది. అచ్చం అలాగే మూలుగ బొక్క కోసం జరిగిన గొడవ.. చిరవకు పెళ్లి సంబంధం రద్దు అయ్యే వరకు వెళ్లింది. ఈ […]
తాజావార్తలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సెన్సార్.. ‘A’ సర్టిఫికెట్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?