ఆస్ట్రేలియా స్టార్స్ పాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్‌లకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఓ ఐపీఎల్ ప్రాంచైజీ ఇద్దరికీ 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ.58.2 కోట్లు) చొప్పున ఆఫర్ చేసింది. ఏడాది పొడవునా తమ ఫ్రాంచైజీకి చెందిన జట్ల తరఫున టీ20 లీగుల్లో ఆడాలని తెలిపింది. అయితే ఈ భారీ మొత్తం అందుకోవాలంటే.. ఓ కండిషన్ పెట్టింది. కమ్మిన్స్, హెడ్‌లు ముందుగా ఆస్ట్రేలియా క్రికెట్ నుంచి బయటకు రావాలని షరతు పెట్టింది. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సదరు ఐపీఎల్ ప్రాంచైజీ ఇచ్చిన భారీ ఒప్పందాన్ని పాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్‌లు తిరస్కరించారని తెలుస్తోంది. ఇద్దరూ ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి కట్టుబడి ఉన్నారని ది ఏజ్ తన నివేదికలో పేర్కొంది. ఈ ఆఫర్ ఆసీస్ ఆటగాళ్ల జీతాలను పెంచే దిశగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఒత్తిడిని తీసుకొచ్చేదే అని రాసుకొచ్చింది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా, రాష్ట్రాల క్రికెట్ సంఘాలు సహా ప్లేయర్ల యూనియన్‌లోనూ చర్చలు జరిగాయట. అయితే ఇప్పటివరకు దీనిపై అధికారిక సమాచారం మాత్రం లేదు. ఐపీఎల్‌లో కమ్మిన్స్, హెడ్‌లు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.
Also Read: Madhavi Latha: బీజేపీ పెద్దలను కలిసిన మాధవీలత.. జూబ్లీహిల్స్ సీటు ఖాయం కానుందా!
పాట్ కమిన్స్‌ను గతేడాది రూ.18 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ రిటైన్ చేసుకుంది. కమిన్స్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి ఏడాదికి రూ. 8.74 కోట్లు వస్తాయి. జాతీయ బోర్డు నుంచి అన్నీ కలుపుకొని దాదాపు రూ.17.50 కోట్లు వస్తాయి. ఐపీఎల్‌తో వచ్చే ఆదాయం కలిపి దాదాపుగా రూ.35 కోట్ల వరకూ వస్తాయి. ట్రావిస్ హెడ్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి రూ. 8.70 కోట్లు, ఎస్‌ఆర్‌హెచ్ నుంచి రూ.14 కోట్లు అందుతాయి. మొత్తంగా ఏడాదికి రూ. 25-30 కోట్ల వరకూ సంపాదిస్తాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆఫర్ రూ.58 కోట్లు కాబట్టి.. హెడ్‌కు బాగానే గిట్టుబాటు అవుతుంది. కానీ ఈ ఇద్దరు క్రికెట్ ఆస్ట్రేలియాను వదిలిపెట్టం అని అంటున్నారు.