మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. 265 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 45.5 ఓవర్లలో 8 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. మాథ్యూ షార్ట్ (74; 78 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కూపర్ కొన్నోలీ (57; 51 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. మిచెల్ ఓవెన్ (36), మాట్ రెన్షా (30)లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 కోసం మినీ వేలం డిసెంబర్ 13-15 మధ్య జరిగే అవకాశం ఉంది. అన్ని జట్లు నవంబర్ 15 లోపు తమ రిటెన్షన్, రిలీజ్ లిస్టులను సమర్పించాలి. ఐపీఎల్ వేలానికి ముందు కొన్ని జట్లు ఆటగాళ్లను విడుదల చేయడమే కాకుండా, సహాయక సిబ్బందిలో కూడా మార్పులు చేస్తున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ ఇటీవల కేన్ విలియమ్సన్‌ను వ్యూహాత్మక సలహాదారుగా నియమించింది. తాజాగా పంజాబ్ కింగ్స్ కూడా తమ సహాయక సిబ్బందిలో కీలక […]
సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన ఆది శ్రీనివాస్… ‘కేటీఆర్.. నువ్వెన్ని పెడబొబ్బలు పెట్టినా ఏం ఉపయోగం లేదు. మా ముఖ్యమంత్రి పైన పిచ్చి పిచ్చిగా వాగినంత మాత్రాన నువ్వు పెద్ద మొగోడివి కావు’ అని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నంత కాలం కేటీఆర్, కేసీఆర్ ఇద్దరు కలిసి తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. ‘మీ బతుకు, నీ అయ్య బతుకు […]
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య రెండో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 రన్స్ చేసింది. రోహిత్ శర్మ (73; 97 బంతులు, 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (61; 77 బంతులు, 7 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. అక్షర్ పటేల్ (44; 41 బంతులు, 5 […]
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. టీమిండియాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. అడిలైడ్ వన్డేలో గెలిస్తేనే మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం అవుతుంది. రెండో వన్డేలో అందరి కళ్లు స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పైనే ఉన్నాయి. తొలి వన్డేలో ఇద్దరూ విఫలమైన సంగతి తెలిసిందే. అడిలైడ్‌లో అయినా రో-కోలు రాణించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. అయితే అడిలైడ్ […]
ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య గురువారం (అక్టోబర్ 23) అడిలైడ్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఉదయం 9 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకం. రెండో వన్డేలో గెలిస్తేనే మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేస్తుంది. మొదటి వన్డేలో అన్ని విభాగాల్లో విఫలమైన భారత జట్టు పుంజుకుంటేనే విజయం సాధ్యమవుతుంది. గత మ్యాచ్‌లో విఫలమైన స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల పైనే అందరి […]
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అరుదైన ఘనత సాధించారు. కేరళలోని శబరిమల ఆలయంలో పూజలు చేసిన తొలి మహిళా ప్రెసిడెంట్‌గా ముర్ము నిలిచారు. 1970లలో వివి గిరి తర్వాత శబరిమల ఆలయాన్ని సందర్శించిన రెండవ రాష్ట్రపతి ముర్మునే. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం శబరిమలలోని అయ్యప్ప ఆలయాన్ని సందర్శించారు. ఇరుముడితో వచ్చిన ఆమె అయ్యప్పకు ప్రత్యేక పూజలు చేశారు. Also Read: Success Story: తల్లికి వాగ్దానం చేసి.. 150కి పైగా డిగ్రీలు చేసిన కొడుకు! టర్గెట్ ఏంటో […]
మనలో చాలా మందికి ‘ఫైనల్ పరీక్షలు’ అంటే ఓ ప్రయాణంకు ముగింపు, కొత్త జీవితానికి నాంది. కానీ చెన్నైకి చెందిన ఒక వ్యక్తికి విద్య గమ్యస్థానం కాదు.. జీవితాంతం కొనసాగే ప్రయాణం. తల్లికి వాగ్దానం చేసి 150కి పైగా డిగ్రీలు చేశారు. అతని పేరు ప్రొఫెసర్ డాక్టర్ వి.ఎన్. పార్థిబన్. ఆయనను ‘డిగ్రీల భాండాగారం, ‘వాకింగ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ నాలెడ్జ్’ అని పిలుస్తారు. కానీ ఈ అద్భుతమైన ప్రయాణానికి ప్రొఫెసర్ పార్థిబన్ ప్రేరణ ఎక్కడినుంచి మొదలైందో తెలుసా?. […]
2025 ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకోవాలనే పాకిస్తాన్ ఆశలు పూర్తిగా అడియాసలయ్యాయి. మంగళవారం కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం దక్షిణాఫ్రికా చేతిలో 150 పరుగుల తేడాతో ఓడిపోయింది. వర్ష ప్రభావితమైన ఈ మ్యాచ్‌లో పాక్ 20 ఓవర్లలో 234 పరుగులు చేయాల్సి ఉండగా.. ఏడు వికెట్లకు 83 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 312 […]
అక్టోబర్ 17న రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా మంగళవారం ఇంట్రాడేలో 6.3 శాతం భారీ క్షీణత తర్వాత బుధవారం బంగారం ఔన్సుకు 2.9 శాతం తగ్గి.. 4,004 డాలర్లకు చేరుకుంది. ఇది 12 సంవత్సరాలలో అతిపెద్ద తగ్గుదల అనే చెప్పాలి. వెండి కూడా ఇంట్రాడేలో 7.1 శాతం పడిపోయింది కానీ.. తరువాత దాదాపు 2 శాతం కోలుకుని 47.6 డాలర్ల వద్ద ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆకస్మిక తగ్గుదల […]