మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య రెండో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 రన్స్ చేసింది. రోహిత్ శర్మ (73; 97 బంతులు, 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (61; 77 బంతులు, 7 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. అక్షర్ పటేల్ (44; 41 బంతులు, 5 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 4, జేవియర్ బ్రేట్‌లెట్ 3, మిచెల్ స్టార్క్ 2 వికెట్లు పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్లు రోహిత్, విరాట్ కోహ్లీల లెక్కలు తారుమారయ్యాయి.
Also Read: Chiranjeevi : చిరంజీవి ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టాడు..?
అడిలైడ్‌లో కింగ్ విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన నాలుగు వన్డేలలో 244 పరుగులు చేశాడు. అడిలైడ్‌లో 2 సెంచరీలు కూడా బాదాడు. రెండో వన్డేలో కూడా కింగ్ చెలరేగుతాడని అందరూ ఆశించారు. కానీ విరాట్ కనీసం పరుగుల ఖాతా కూడా తెరలేకపోయాడు. నాలుగు బంతులు ఆడి వికెట్ల ముందు దొరికిపోయాడు. మరోవైపు అడిలైడ్‌లో చెత్త రికార్డు ఉన్న రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఆదిలోనే రెండు వికెట్స్ పడినా.. ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. దాంతో అడిలైడ్‌లో సీన్ రివర్స్ అయిందే అని ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.