Pamidi: అనంతపురం జిల్లా పామిడి పట్టణ కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రవి అనే యువకుడు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో కత్తితో వీరంగం సృష్టించి స్థానికులను భయభ్రాంతులకు గురి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకోగా.. వారిపైనా దాడికి పాల్పడ్డాడు. ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన సమయంలో రవి కత్తితో దాడి చేయడమే కాకుండా, పోలీసు జీప్‌పై కర్రలతో దాడి చేశాడు. దీంతో కొంతసేపు పామిడి పట్టణంలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని స్థానికులు భయంతో ఇళ్లలోకి వెళ్లిపోయారు.
India vs Pakistan U19: మరోసారి నో షేక్‌హ్యాండ్స్.. చర్చనీయాంశమైన ఇండియా–పాక్ మ్యాచ్
ఈ ఘటనపై రవి బంధువులు స్పందిస్తూ.. అతడు గత కొన్ని రోజులుగా మతిస్థిమితం సరిగా లేక చికిత్స తీసుకుంటున్నాడని వెల్లడించారు. మానసిక సమస్యల కారణంగానే ఈ దాడులకు పాల్పడ్డాడని తెలిపారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని రవిని కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tilak Varma Dating: క్యూట్ క్రికెటర్‌తో తిలక్ వర్మ డేటింగ్..!