ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య గురువారం (అక్టోబర్ 23) అడిలైడ్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఉదయం 9 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకం. రెండో వన్డేలో గెలిస్తేనే మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేస్తుంది. మొదటి వన్డేలో అన్ని విభాగాల్లో విఫలమైన భారత జట్టు పుంజుకుంటేనే విజయం సాధ్యమవుతుంది. గత మ్యాచ్‌లో విఫలమైన స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల పైనే అందరి ఆశలు ఉన్నాయి. అయితే రెండో వన్డేలో కోహ్లీ అరుదైన ఘతన అందుకునే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Droupadi Murmu: తొలి మహిళా ప్రెసిడెంట్‌గా.. ద్రౌపదీ ముర్ము అరుదైన ఘనత!
విరాట్ కోహ్లీ రెండో వన్డేలో మరో 25 పరుగులు చేస్తే.. అడిలైడ్‌లో 1000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకుంటాడు. దాంతో అడిలైడ్‌లో వెయ్యి రన్స్ చేసిన తొలి విదేశీ బ్యాటర్‌గా కింగ్ నిలుస్తాడు. అడిలైడ్‌లో ఇప్పటివరకు ఏ బ్యాటర్ కూడా 1000 పరుగులు చేయలేదు. అడిలైడ్‌లో కింగ్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది. ఈ మైదానంలో నాలుగు వన్డేలు ఆడిన కోహ్లీ 244 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు ఉన్నాయి. చూడాలి మరి కింగ్ ఈ అరుదైన రికార్డు అందుకుంటాడో లేదో.