టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ తండ్రి శాంసన్ విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా మాజీ కెప్టెన్స్ ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తన కొడుకు పదేళ్ల కెరీర్‌ను నాశనం చేశారని ఆరోపించారు. సంజూ నైపుణ్యాన్ని గుర్తించి జట్టులో అవకాశం ఇచ్చిన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లకు విశ్వనాథ్ ధన్యవాదాలు తెలిపారు. సంజూ ఎప్పుడూ రికార్డుల కోసం ఆడడని, కొందరు స్వార్థం కోసం ఆడుతారని చెప్పుకొచ్చారు. 2015లో అంతర్జాతీయ క్రికెట్లోకి […]
‘రోహిత్ శర్మ’ పేరు చెప్పగానే ప్రతి క్రికెట్ అభిమానికి అతడి భారీ హిట్టింగే గుర్తుకొస్తుంది. భారీ సిక్సులు బాదే రోహిత్‌కు ‘హిట్‌మ్యాన్’ అనే ట్యాగ్ ఉంది. రోహిత్ తన దూకుడైన బ్యాటింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులను తన పేరిట లికించుకున్నాడు. ముఖ్యంగా వన్డే క్రికెట్లో అసాధారణమైన రికార్డులను తన పేరిట నమోదు చేశాడు. ఓ అరుదైన రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. అదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఒకప్పుడు వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ చేయడం ఎవరి […]
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్‌పై చేసిన వ్యాఖ్యలతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ విమర్శలకు గురవుతున్నాడు. ఇటీవల టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విరుచుకుపడగా.. తాజాగా ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్ లీ కూడా పాంటింగ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లాంటి పెద్ద సిరీస్‌కు ముందు అపహాస్యంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన కోహ్లీని రెచ్చగొట్టేలా మాట్లాడటం మంచిది కాదన్నాడు. […]
గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్. ఇటీవల పెరిగిన బంగారం ధరలు దిగొస్తున్నాయి. వరుసగా మూడో రోజు గోల్డ్ రేట్స్ తగ్గాయి. గత రెండు రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.600, రూ.1470 తగ్గగా.. నేడు రూ.400 తగ్గింది. మరోవైపు 22 క్యారెట్లపై వరుసగా 550, 1350, 400 తగ్గింది. బులియన్ మార్కెట్లో బుధవారం (నవంబర్ 13) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.70,450గా.. 24 క్యారెట్ల ధర రూ.76,850గా నమోదైంది. వరుసగా […]
దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాలుష్యపు పొగ ఢిల్లీని పూర్తిగా కమ్మేసింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం.. బుధవారం ఉదయం 8 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 417 పాయింట్లకు చేరుకుంది. అర్ధరాత్రి తర్వాత నుంచి గాలి నాణ్యత సూచీ పడిపోతూ వచ్చింది. మంగళవారం సాయంత్రం 361 ఉండగా.. బుధవారం ఉదయం 400 దాటేసింది. దీంతో పరిస్థితిని తీవ్రమైనదిగా పేర్కొంది. ఏక్యూఐ 400 దాటడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. […]
స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 విలీనం అవుతున్న విషయం తెలిసిందే. ఈ విలీన ప్రక్రియ నేడే (నవంబర్ 13) పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. విలీనం తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు డిస్నీ+హాట్‌స్టార్, జియోసినిమా కలిసి ఒకే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా అవతరించనున్నాయి. ఈ నేపథ్యంలో జియోస్టార్ (JioStar.com) అనే డొమైన్ పేరుతో ఓ వెబ్సైట్ ప్రత్యక్షమైంది. ప్రస్తుతానికి అందులో ‘కమింగ్ సూన్’ అని కనిపిస్తోంది. Also Read: Koti Deepotsavam 2024: ఐదవ రోజు […]
Koti Deepotsavam 2024: ‘రచన టెలివిజన్ లిమిటెడ్’ ప్రతీ ఏడాది హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ‘కోటి దీపోత్సవం’ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో జరిగే ఈ దీపాల పండగకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి.. దీపాలను వెలిగిస్తుంటారు. ఈ ఏడాది నవంబర్ 9 నుంచి 25 వరకు కోటి దీపోత్సవం జరగనుంది. కోటి దీపోత్సవం 2024లో ఇప్పటికే నాలుగు రోజులు పూర్తి కాగా.. వేలాది మంది […]
ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 కోసం భారత జట్టు రెండు బృందాలుగా ఆస్ట్రేలియా చేరుకుంది. బలమైన ఆస్ట్రేలియాను ఎదుర్కొనే దిశగా రోహిత్ సేన ప్రాక్టీస్ మొదలెట్టింది. మంగళవారం టీమిండియా ప్లేయర్స్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. తొలి శిక్షణ శిబిరంలో శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ తదితరలు బ్యాటింగ్ సాధన చేశారు. హిట్టర్లు పంత్, జైస్వాల్ భారీ షాట్లు ఆడారు. జైస్వాల్ కొట్టిన ఓ బంతి స్టేడియం పక్కనే ఉన్న రహదారిపై పడింది. […]
భారత టీ20 జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో నేడు మూడో టీ20లో తలపడనుంది. దక్షిణాఫ్రికా పర్యటనను ఘన విజయంతో ఆరంభించిన భారత్.. రెండో మ్యాచ్‌లో తడబడింది. దాంతో మూడో టీ20 కీలకంగా మారింది. ఈ టీ20లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని సూర్య సేన చూస్తోంది. బుధవారం రాత్రి 8.30 గంటల నుంచి స్పోర్ట్స్18, జియో సినిమాలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. సంజూ శాంసన్ తొలి మ్యాచ్‌లో సెంచరీ చేయగా.. రెండో […]