గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్. ఇటీవల పెరిగిన బంగారం ధరలు దిగొస్తున్నాయి. వరుసగా మూడో రోజు గోల్డ్ రేట్స్ తగ్గాయి. గత రెండు రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.600, రూ.1470 తగ్గగా.. నేడు రూ.400 తగ్గింది. మరోవైపు 22 క్యారెట్లపై వరుసగా 550, 1350, 400 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (నవంబర్ 13) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.70,450గా.. 24 క్యారెట్ల ధర రూ.76,850గా నమోదైంది.
వరుసగా రెండు రోజులు తగ్గిన వెండి ధర నేడు స్థిరంగా ఉంది. బుధవారం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.91,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.1,01,000గా ఉంది. ముంబై, ఢిల్లీలలో 91 వేలుగా నమోదైంది. డోనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్ బంగారం, వెండిపై గట్టిగానే పడింది. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ భారీ విజయంతో గెలిచిన నాటి నుంచి మనదేశంలో రేట్లు తగ్గుతున్నాయి. దేశీయ మార్కెట్‌లలో బంగారం, వెండి ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.70,450
విజయవాడ – రూ.70,450
ఢిల్లీ – రూ.70,600
చెన్నై – రూ.70,450
బెంగళూరు – రూ.70,450
ముంబై – రూ.70,450
కోల్‌కతా – రూ.70,450
కేరళ – రూ.70,450
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.76,850
విజయవాడ – రూ.76,850
ఢిల్లీ – రూ.76,850
చెన్నై – రూ.77,290
బెంగళూరు – రూ.76,850
ముంబై – రూ.76,850
కోల్‌కతా – రూ.76,850
కేరళ – రూ.76,850
Also Read: KKR Captain: కేకేఆర్ కీలక నిర్ణయం.. కెప్టెన్‌గా టీమిండియా నయా సంచలనం!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,01,000
విజయవాడ – రూ.1,01,000
ఢిల్లీ – రూ.91,000
ముంబై – రూ.91,000
చెన్నై – రూ.1,01,000
కోల్‌కతా – రూ.91,000
బెంగళూరు – రూ.91,000
కేరళ – రూ.1,01,000