ఐపీఎల్ 2024లో అదరగొట్టిన వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు టీ20 ప్రపంచకప్ 2024లో చోటు దక్కింది. మెగా టోర్నీకి ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ప్రపంచకప్ అనంతరం శ్రీలంక పర్యటనలో వచ్చిన రెండు అవకాశాలను వృథా చేసుకున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. బంగ్లాదేశ్‌తో మూడో టీ20లో సెంచరీ చేసిన సంజూ.. ప్రస్తుతం జరుగుతున్న దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు. సంజూ శాంసన్ దక్షిణాఫ్రికాపై తొలి మ్యాచ్‌లోనే శతకం బాదాడు. […]
గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్. ఆల్‌టైమ్ రికార్డు ధరకు చేరిన బంగారం ధరలు.. దిగొస్తున్నాయి. వరుసగా నాలుగోరోజు గోల్డ్ రేట్స్ తగ్గాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,100 తగ్గగా.. 22 క్యారెట్లపై రూ.1,200 తగ్గింది. బులియన్ మార్కెట్లో గురువారం (నవంబర్ 14) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.69,350గా.. 24 క్యారెట్ల ధర రూ.75,650గా ఉంది. గత నాలుగు రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600, […]
తెలుగు కుర్రాడు తిలక్ వర్మ గురించి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర విషయం చెప్పాడు. రెండో టీ20 అనంతరం తిలక్ తన వద్దకు వచ్చి.. మూడో మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బరిలోకి దిగుతానని చెప్పాడన్నాడు. తనను అడిగి మరీ ఛాన్స్ తీసుకున్న తిలక్.. సెంచరీతో సత్తా చాటాడని సూర్య తెలిపాడు. చివరివరకూ ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఆనందంగా ఉందన్నాడు. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా బుధవారం జరిగిన మూడో టీ20లో […]
ప్రతి ఏడాది మాదిరిగానే ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమం భక్తి టీవీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. నవంబర్ 9న ఆరంభమైన ఈ దీపాల పండుగ.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో దిగ్వజయంగా కొనసాగుతోంది. ఇల కైలాసంలో జరిగే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. హైదరాబాద్ మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కోటి దీపోత్సవంలోని కార్యక్రమాలను వీక్షించి.. లోకాన్నే మైమరిచిపోయేలా పునీతులవుతున్నారు. కోటి దీపోత్సవంలో […]
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మూడో టీ20లో రెండు వికెట్స్ తీయడంతో వరుణ్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ సిరీస్‌లో ఈ మిస్టరీ స్పిన్నర్ ఇప్పటివరకు 10 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా వెటరన్ స్పిన్నర్ […]
తెలుగు తేజం, భారత్ యువ బ్యాటర్ తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లో నిలిచాడు. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా బుధవారం జరిగిన మూడో టీ20లో తిలక్ సెంచరీ (107 నాటౌట్; 56 బంతుల్లో 8×4, 7×6) చేయడంతో ఈ ఫీట్ నమోదు చేశాడు. తిలక్ సెంచరీతో 14 ఏళ్ల సురేశ్ రైనా రికార్డు బద్దలైంది. 2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో […]
నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. 220 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా 7 వికెట్లకు 208 పరుగులు చేయడంతో టీమిండియా 11 పరుగుల తేడాతో నెగ్గింది. ఛేదనలో హెన్రిచ్ క్లాసెన్ (41; 22 బంతుల్లో 1×4, 4×6), మార్కో యాన్సెన్ (54; 17 బంతుల్లో 4×4, 5×6) సంచలన బ్యాటింగ్‌తో కంగారెత్తించినా.. చివరికి భారతే పైచేయి సాధించింది. ఈ విజయంతో సిరీస్‌లో భారత్ 2-1తో […]
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో సబ్‌బ్రాండ్ ‘ఐకూ’ మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్దమైంది. ఇటీవల గ్లోబల్ మార్కెట్లో రిలీజ్ అయిన ‘ఐకూ 13’ ఫోన్‌ను.. డిసెంబర్ 3న భారతదేశంలో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెప్ ప్రాసెసర్‌తో వస్తోంది. ఈ ఫోన్ ప్రత్యేక ఏంటంటే.. క్యూ2 గేమింగ్ చిప్సెట్ కూడా ఉంటుంది. అమెజాన్ ఇండియా వెబ్సైట్లో ఐకూ 13 అందుబాటులో ఉంటుంది. […]
నవంబర్ 24, 25 తేదీల్లో ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుంది. మూడేళ్ల పాటు ఆటగాళ్లను దక్కించుకొనేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. వేలం కోసం క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఏ ప్లేయర్ ఎంత మొత్తం దక్కించుకుంటాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్తియ ముగియగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ వద్ద రూ.45 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఈ సొమ్ముతో నాణ్యమైన భారత క్రికెటర్లను దక్కించుకోవడం సన్‌రైజర్స్‌కు చాలా […]
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ‘రియల్మీ’.. తన జీటీ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ‘రియల్మీ జీటీ 7 ప్రో’ను చైనాలో విడుదల చేసింది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో వస్తున్న ఫస్ట్ ఫోన్ ఇదే. ఇందులో ఇందులో జంబో బ్యాటరీ, సూపర్ కెమెరాను అందించింది. దుమ్ము, నీరు చేరకుండా ఐపీ68 రేటింగ్‌ను ఇచ్చారు. ఈ ఫోన్ నవంబర్ 26న భారతదేశంలో లాంచ్ కానుంది. జీటీ 7 ప్రో ఫోన్లో ఏ […]